Indiramma Houses: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టి ఇస్తామన్న ఎన్నికల హామీని ఎట్టకేలకు నిలబెట్టుకోబోతుంది. ప్రభుత్వం అధికారికంగా ఇందిరమ్మ ఇండ్ల అధికారుల మంజూరు జాబితా 2025ను విడుదల చేసింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం కింద ఇల్లు లేని వారు, ఆర్థిక సాయం పొందడానికి అర్హులైన లబ్ధిదారుల లిస్టును సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదవారికి, ఇల్లు లేని నిరాశ్రయులకు పక్కా ఇంటి నిర్మాణాలు చేసి ఇవ్వడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్టేటస్ ను ఆన్లైన్ లో చూసుకునే విధంగా ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ నుండి జిల్లాల వారీగా జాబితాను డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కూడా కల్పించింది.
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈపాటికే ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకం పేరిట ఇల్లు లేని వారికి, ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ పథకం కింద జాబితాలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ₹5 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. జాబితాలో లబ్ధిదారులు తమ పేర్లను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ indirammaindlu.telangana.gov.in ద్వారా లాగిన్ కావచ్చు.
ఇందిరమ్మ ఇంటి మంజూరు దరఖాస్తుదారులకు ఈ అర్హతలు కలిగి ఉండాలి:
1) తెలంగాణలో శాశ్వత నివాసి లేదా రాష్ట్రంలో 5 సంవత్సరాల నుండి నివసించి ఉండాలి.
2) దారిద్ర్య రేఖకు కిందిస్థాయి లేదా ఆర్థికంగా వెనుకబడిన వారు అయి ఉండాలి.
3) వార్షిక ఆదాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిమితికి మించి ఉండకూడదు.
4) దరఖాస్తుదారుడు పర్మినెంట్ ఇల్లు కలిగి ఉండకూడదు.
5) లబ్ధిదారుని ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ ఉండాలి.
6) గతంలో ప్రభుత్వపరంగా ఇల్లు లబ్ధి పొంది, శాశ్వత ఇల్లు కలిగి ఉన్నవారు అనర్హులు
Online వెబ్ సైట్ లో జాబితాలో పేరు తనిఖీ చేసుకోలేని వారు స్థానిక మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ప్రజా సేవా కేంద్రాలలో లబ్ధిదారుడి స్థితిని ధృవీకరించడంలో అధికారులు help చేస్తారు. తదుపరి ఇన్ఫర్మేషన్లు కూడా అందజేస్తారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితా ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఫాస్ట్ ట్రాక్ ఆమోద ప్రక్రియ ద్వారా ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా లబ్ధిదారులకు దశలవారీగా డబ్బులు అందుతాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం 2005 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ పేర్లను తనిఖీ చేయడం చాలా అవసరం. లబ్ధిదారుల లిస్టు ఆన్లైన్లో ఉంది. కాబట్టి లబ్ధిదారుల ఆధార్ లేదా మొబైల్ నెంబర్ ను ఉపయోగించి స్టేటస్ తెలుసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని ప్రజాసేవకేంద్రం లేదా ప్రభుత్వ గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారులను సంప్రదించండి.