Wearing Toe Rings: పొరపాటున మహిళ కాలిమెట్టెలు పోతే.. ఏం జరుగుతుంది?.. భర్తకు సంబంధించి 3 సంకేతాలు

Wearing Toe Rings
Wearing Toe Rings

Wearing Toe Rings: వైవాహిక జీవితంలో స్త్రీ కాలిమెట్టలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మతం ప్రకారం సనాతన ధర్మంలో వివాహం చేసుకున్న స్త్రీ యొక్క కాలిమెట్టలు వైవాహిక ఆనందానికి చిహ్నంగా చెప్పబడుతుంది. వివాహం చేసుకున్న స్త్రీ కాలి మెట్టలు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. ఇది అనేక నమ్మకాలకు అలాగే సాంప్రదాయాలకు సాక్షి కూడా. పెళ్లి చేసుకుని స్త్రీలు ఎల్లప్పుడూ కాలి బొటన వేలు పక్కన ఉన్న వేలుకు మెట్టలను ధరిస్తారు. అయితే వివాహిత స్త్రీ కాలిమెట్టలు పోవడం అనేది శకున శాస్త్రం ప్రకారం భర్తకు సంబంధించిన అనేక సంకేతాలను తెలియజేస్తుందని నిపుణులు చెప్తున్నారు. సనాతన ధర్మం ప్రకారం స్త్రీలను లక్ష్మీదేవికి చిహ్నంగా చెప్తారు. ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆభరణాలలో నిండి ఉంటుంది.

ఇక మహిళల జీవితంలో ఆభరణాలకు ఉన్న ప్రత్యేకమైన ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. మహిళలు ధరించే ఆభరణాలను లక్ష్మీదేవి ఆశీర్వాదంగా కూడా పరిగణిస్తారు. వివాహం చేసుకొన్న ప్రతి మహిళ తన కాలి బొటనవేలు పక్కన ఉన్న వేలుకు మెట్టెలను ధరిస్తుంది. ఈ మెట్టెలను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. హిందూమతంలోని అనేక సాంప్రదాయాలు వివాహిత స్త్రీ కాలిమెట్టలతో ముడిపడి ఉన్నాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖాళీ మెట్టెలను చంద్రుడికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు.

అయితే తెలియకుండా ఆకస్మాత్తుగా మెట్టెలు పోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మెట్టెలు పోగొట్టుకోవడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభప్రదంగా పరిగణించబడదు. జీవితంలో ఇది అశుభాన్ని సూచిస్తుందట. వివాహిత స్త్రీ కాలిమెట్టలు పోవడం అంటే భర్త ఆరోగ్యానికి సంబంధించిన సంకేతం అని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఆమె భర్త ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒకవేళ హఠాత్తుగా కాళీ వేలు నుంచి మెట్టెలు జారీ కింద పడిపోతే అది భర్త ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని సూచిస్తుంది అంటూ నిపుణులు చెప్తున్నారు. కాలి నుంచి మెట్టెలు జారీ పడిపోవడం అంటే భర్త అప్పులలో కోరుకొని ఉన్నాడు అని సంకేతం అంటూ నిపుణులు చెప్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now