MOBILE TIPS: మొబైల్ ఫోన్ పేలడానికి ముఖ్య కారణం ఇదే.. మీ ఫోన్ పేలకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి

MOBILE TIPS
MOBILE TIPS

MOBILE TIPS: మీరు చాలా సార్లు ఫోన్లు పేలిపోవడాన్ని వినే ఉంటారు. అయితే దీనికి ప్రధాన కారణం బ్యాటరీ సమస్యలు అని చెప్పొచ్చు. చాలా రకాల ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి గొప్ప పనితీరును అందిస్తాయి కాబట్టి వీటిని ఉపయోగిస్తారు. కానీ బ్యాటరీ పాడైపోయినప్పుడు లేదా ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టబడినప్పుడు లేదా తీవ్రమైన ఉష్ణోగ్రతలకు ఫోన్ గురైనప్పుడు పేలిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోను ప్రాథమిక అవసరాలలో ఒకటిగా ఉన్నాయి. ఫోన్లతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అలాగే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. మొబైల్ ఫోన్ పేలడం గురించి తరచుగా వార్తల్లో వింటూనే ఉంటాము. అప్పుడు మన ఫోన్ కూడా పేలే అవకాశం ఉందా అంటూ అనుకుంటాము. అయితే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వేడెక్కడం, సరిగ్గా చార్జింగ్ పెట్టకపోవడం, బ్యాటరీ లోపాలు, తయారీ లోపాలు వంటి అనేక కారణాల వలన ఫోన్ తేలిపోయే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా ఫోన్ పేలిపోవడానికి బ్యాటరీ సమస్యలు కారణం. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా గొప్ప పనితీరును అందించే లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. కొన్ని కొన్ని సార్లు ఫోన్ తయారీ సమయంలో నాణ్యత లేని బ్యాటరీలను కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో ఎక్కువగా ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇవి చాలా అరుదుగా జరుగుతాయి. ఈ క్రమంలో ఫోన్ తయారీ కంపెనీలు కొన్ని మోడల్లను రీ కాల్ చేస్తాయి.

స్మార్ట్ ఫోన్ కింద పడినట్లు అయితే దాని ప్రభావం బ్యాటరీ పై పడుతుంది. అలాగే దాని నష్టం ఫోన్ కాన్ఫిగరేషన్ పై పడుతుంది. ఈ క్రమంలో అది పేలిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఫోనును ఓవర్ ఛార్జ్ చేయడం లేదా నాణ్యతలేని చార్జింగ్ కేబుల్ ను ఉపయోగించడం వలన కూడా అధిక వేడి ఉత్పత్తి అయ్యి ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. మీరు ఎల్లప్పుడూ మీ ఫోన్ తో పాటు వచ్చిన చార్జర్ ని మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ అది పాడైపోతే అదే ఫోన్ కంపెనీ చార్జర్ ను కొనుగోలు చేసి వాడాలి. నాసిరకం చార్జర్ ను ఉపయోగించడం వలన కూడా ఫోన్ బ్యాటరీ పాడైపోతుంది. ప్రతిసారి కూడా 100% చార్జ్ చేయకూడదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now