Home ఆధ్యాత్మికం Shakuna Shastra: ఇంట్లో గాజు వస్తువులు లేదా అద్దం పగిలితే.. దేనికి సంకేతమో తెలుసా..!

Shakuna Shastra: ఇంట్లో గాజు వస్తువులు లేదా అద్దం పగిలితే.. దేనికి సంకేతమో తెలుసా..!

Shakuna Shastra
Shakuna Shastra

Shakuna Shastra: హిందూమతంలో శకున శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. జ్యోతిష శాస్త్రంలో ఉన్న అనేక శాఖలలో ఇది కూడా ఒకటి. మన దైనందిన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు వాటి వెనక ఉన్న మంచి లేదా చెడు గురించి శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. కొన్ని వస్తువులు, కొందరు వ్యక్తులు శుభ శకునాలు గాను అలాగే కొన్ని అశుభ శకునాలు గాను చాలామంది భావిస్తారు. చాలామంది మంచి లేదా చెడు శకునాలు గురించి నమ్ముతూ ఉంటారు. మన రోజువారి జీవితంలో మంచి లేదా చెడు శకునాలు చాలా పనులతో ముడిపడి ఉన్నాయి. కొన్ని శకునాలు శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని చెడు శకునాలు అశుభ ఫలితాలను కలిగిస్తాయి అని చాలామంది నమ్మకం.

ఇంట్లో జరిగే కొన్ని చెడు శకునాలు ఆ వ్యక్తికి రాబోయే కష్టాల గురించి హెచ్చరిస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. సనాతన ధర్మంలో శుభ మరియు చెడు శతనాల గురించి అనేక కథలు ఉన్నాయి. ఉదయం పాలు చూడడం చాలా శుభ్రంగా చెప్తారు. అలాగే పాలు మరుగుతున్న సమయంలో అవి కింద పడటం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలా పాలు పొంగడం వలన ఆ ఇంట్లో ఆనందం మరియు శాంతి కలుగుతాయని అందరి నమ్మకం. ఒకవేళ పాలు చేతిలో నుంచి జారీ కింద పడితే దాన్ని చెడు శకునంగా భావిస్తారు. చేతిలో నుంచి జారి పాలు కింద పడడం అంటే త్వరలో ఏదో ప్రమాదం జరగబోతుందని సంకేతంగా భావిస్తారు. ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే కత్తి అనేక మంచి మరియు చెడు శకునాలను కలిగి ఉన్న వస్తువుగా చెప్తారు. పొరపాటున చేతిలో నుంచి కత్తి జారి కింద పడడం కూడా అశుభంగా చెప్తారు. ఇది కుటుంబ సభ్యుల మీద గొడవలకు దారితీస్తుందని నమ్ముతారు.

ఇంట్లో గాజు వస్తువులు లేదా అర్థం పగలడం కూడా చెడు శకునంగా భావిస్తారు. అలా పగిలిన అద్దంలో చూసుకోవడం కూడా చెడు శకునమే. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో చీపురుతో శుభ్రం చేయడం కూడా దురదృష్టకరమని చెప్తున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు తర్వాత చీపురు పట్టుకొని ఇంటిని ఊడ్చడం ప్రారంభిస్తే ఆ ఇంటికి అతిధులు రాబోతున్నారని సంకేతం. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో నీటితో నిండిన బకెట్ లేదా పాలు నిండిన బకెట్ కనిపిస్తే అది చాలా శుభప్రదంగా చెబుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లే సమయంలో ఖాళీ బకెట్ కనిపిస్తే అది అశుభ్రంగా చెప్తున్నారు. సనాతన ధర్మంలో నల్లని దుస్తులను చాలా అశుభకరంగా పరిగణిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఎవరైనా నల్లని దుస్తులు ధరించి కనిపించినట్లయితే అది దురదృష్టకరంగా పరిగణిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now