Actress Hema: హీరోయిన్స్ లాగా చాలా అందంగా ఉన్న నటి హేమ కూతురు…లేటెస్ట్ ఫోటోలు వైరల్

Actress Hema
Actress Hema

Actress Hema: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో లేడీ కమెడియన్గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి హేమ. ఇప్పటివరకు హేమ 20050కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ సీనియర్ నటి సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఈమె అసలు పేరు కృష్ణవేణి. సినిమాలలోకి అడుగుపెట్టిన తర్వాత కృష్ణవేణి తన పేరును హేమగా మార్చుకుంది. వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించిన క్షణక్షణం సినిమా నుంచి ఇప్పటివరకు నటి హేమ ఎన్నో సినిమాలలో నటించింది. లేడీ కమెడియన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

సినిమాలతో పాటు ఈమె పేరు వివాదాలలో కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. మా ఎలక్షన్ల సమయంలో హేమా పేరు బాగా వినిపించింది. ఆ సమయంలో నటి హేమ తన తోటి నటీనటుల గురించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే గత ఏడాది బెంగళూరు రేవ్ పార్టీ కు సంబంధించి సంచలనంగా వార్తల్లో నిలిచింది హేమ. ఆ సమయంలో నటి హేమ కూడా ఈ పార్టీలో పాల్గొనే డ్రగ్స్ కూడా తీసుకుందనే వార్తలు వినిపించాయి. రీసెంట్ గా నటి హేమ సినిమాలలో నటించే ప్రసక్తి లేదంటూ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

2021లో రిలీజ్ అయిన క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించిన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇక తర్వాత మరొక సినిమాలో హేమా కనిపించలేదు. అయితే సినిమాల నుంచి తప్పుకున్న నటి హేమ సినిమా ఇండస్ట్రీలోకి తన వారసురాలిగా కూతురిని దింపుతుందా అంటూ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. హేమ కూతురి గురించి సామాజిక మాధ్యమాలలో నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటి హేమ కూతురి లేటెస్ట్ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి. నటి హేమ కూతురు చూసిన అందరూ ఈమె చాలా అందంగా ఉంది, హీరోయిన్ లకు కావాల్సిన లక్షణాలన్నీ ఈమెలో ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now