Business Idea: దాదాపుగా ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఒకసారి పెట్టుబడి పెట్టి ప్రతినెల లాభసాటిగా లాభాలు వచ్చే వ్యాపారం చేయాలి అనుకునే వారి కోసం. మేము మీ ముందుకు తీసుకొస్తున్న ఈ వ్యాపార సలహా మీ ఆలోచనకు తగ్గట్టుగానే ఉంటుందని భావిస్తున్నాం. దీనికి మీరు చేయాల్సిందల్లా వేసవికాలంలో ఎండ వేడి నుండి తట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతారు. కాబట్టి వారి ఆలోచనలకు తగ్గట్లుగానే మనము కొత్త ఆలోచనలతో కష్టమర్లను ఆకర్షించే విధంగా వ్యాపారం చేస్తేనే బిజినెస్ డెవలప్ అవుతుంది. మనకు కస్టమర్లు కూడా పెరుగుతారు. దీంతో లాభాలు వస్తాయి. మార్కెట్లో ఏ వ్యాపారం చేసిన భిన్నంగా ఆలోచించి చేస్తేనే బిజినెస్ లో ముందుకు వెళ్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ ఎండాకాలంలో ఐస్ క్యూబ్ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయి.
ఐస్ క్యూబ్స్ వాడే వారి సంఖ్య పెరిగింది:
ప్రస్తుత ఎండాకాలంలో ఈ ఐస్ క్యూబ్ వాడకానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఎండాకాలంలో జరిగే ప్రతి శుభకార్యాల్లో, ముఖ్యంగా జ్యూస్ సెంటర్ల వద్ద అలాగే పార్టీలలో, క్లబ్బులలో ఐస్ క్యూబ్ వాడకం చాలానే ఉంటుంది. ఎండ వీటి నుండి తట్టుకోవడానికి అందరూ చల్లదనంతో కూడిన కూల్ డ్రింక్స్, జ్యూస్, వాటర్, ఇతరత్ర మొదలైన వాటికి ఆసక్తి చూపడం సహజం. సాధారణంగా ఈ ఎండాకాలంలో ఐస్ క్యూబ్ కి కస్టమర్ల నుండి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.
ఈ వ్యాపారానికి లక్ష రూపాయల పెట్టుబడి:
ముందుగా ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీ వద్ద ఒక లక్ష రూపాయల పెట్టుబడి ఉంటే చాలు. ప్రతి నెల 30 వేల నుండి 60 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మీ వ్యాపారానికి సంబంధించిన అనుమతి 1 తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక ఫ్రీజర్ ను మీరు కొనుగోలు చేసుకోవాలి. దీనికి కావలసింది నీటి వసతి, విద్యుత్తు సరఫరా రెండు ముఖ్యమైనవి.
కస్టమర్లను ఆకర్షించడం:
ఐస్ క్యూబ్స్ ను విభిన్న పరిమాణాలతో విభిన్న రూపాల్లో తయారుచేసి కస్టమర్లను ఆకర్షించాలి. మీరు చేసే ఈ వ్యాపారం కస్టమర్లను ఆకర్షించే విధంగా రకరకాల వెరైటీల ఐస్ క్యూబ్స్ ను రెడీ చేయాలి. ఒకసారి మనం కష్టమర్ ను ఆకర్షించగలిగితే మన వ్యాపారం సవ్యంగా ముందుకు సాగుతుంది. కాబట్టి మార్కెట్లో మనం చేసే వ్యాపారం భిన్నంగా ఉండాలి. ఈ ఐస్ క్యూబ్ తయారు చేసే మిషన్ ఖరీదు 50వేల రూపాయల నుండి మొదలవుతుంది. ఈ వ్యాపారం ఎండాకాలంలో లాభసాటిగా ఉంటుంది. దాదాపుగా ఐస్ క్యూబ్స్ ప్రతి సీజన్ లో చాలామంది వాడుతుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో కస్టమర్లు ఎక్కువగా ఐస్ క్యూబ్ కి ఆసక్తి చూపడంతో దాదాపుగా 40 వేల నుండి 60 వేల వరకు ప్రతినెల ఆదాయం ఉంటుంది. మిగతా సీజన్ లోక్ 20వేల నుండి 30వేల వరకు ఆదాయం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ప్రతినెల మంచి ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు.
ఒక్కసారి 1 లక్ష పెట్టుబడి పెడితే.. ప్రతినెల ₹60 వేల ఆదాయం.. https://t.co/de5dqAh2Vy pic.twitter.com/TIgH80thPd
— Prajashankaravam (@Prajashanka) March 20, 2025