Vastu Tips of Tortoise: హిందూమత సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే చాలా శుభప్రదం అనే వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాంటి ఒక వస్తువులలో తాబేలు కూడా ఒకటి. ఇంట్లో తాబేలును పెట్టుకోవడం వలన చాలా శుభ ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. అయితే తాబేలు విగ్రహాన్ని ఇంట్లో సరైన దిశలో పెట్టడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రంలో అందరూ తాబేలును చాలా పవిత్రంగా భావిస్తారు. తాబేలు విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు శాంతి ఉంటుందని చాలామంది నమ్మకం. పురాణాల ప్రకారం తాబేలు రూపంలో విష్ణువు అవతరించాడు. ఈ అవతారాన్ని కూర్మ అవతారం అంటారు. ఇంట్లో తాబేలు ఉంచుకోవడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ఆ వ్యాపారంలో విజయం సాధిస్తారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాన్ని పనులు ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు.
ఇంట్లో తాబేలు విగ్రహం ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. కెరియర్లో పురోగతి ఉండాలంటే ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉత్తర దిశలో పెట్టాలి. జ్ఞానం, సహనం, దీర్ఘ యుగం చిహ్నంగా తాబేలును ఇంట్లో పెట్టుకుంటారు. ఇది చాలా ప్రశాంతమైన మరియు దీర్ఘాయువు కలిగిన జీవి. ఇంట్లో పూజ గదిలో తాబేలు లేదా అష్టధాతువుతో చేసిన తాబేలు చిత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో తాబేలును నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో ఉంచడం చాలా ఉత్తమం. అలాగే చాలామంది నిపుణులు తాబేలు విగ్రహాన్ని ఇంటికి ఈశాన్యంలో పెట్టాలని చెప్తుంటారు. నీటితో నిండిన పాత్రలో తాబేలు విగ్రహాన్ని పెట్టాలి.
ప్రతిరోజు ఆ విగ్రహం మీద ఒక తులసి కొమ్మను పెట్టాలి. ముఖ్యమైన పనికి వెళ్తున్న సమయంలో మీరు తాబేలు విగ్రహాన్ని చూసినట్లయితే మీకు విజయం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే లోహంతో చేసిన తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉత్తరం లేదా వాయువ్య దిశలో పెట్టుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఉత్తర దిశలో తాబేలు విగ్రహం పెట్టడం వలన పిల్లలకు మంచి జీవితం లభిస్తుంది. ఇంట్లో వాయువ్య దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టినట్లయితే పిల్లలు చదువుపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. కార్యాలయంలో లేదా దుకాణంలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే ఆ కార్యాలయంలో శాంతి, ఆనందం అలాగే ఉద్యోగంలో పురోగతి ఉంటుందని చాలామంది నమ్ముతారు.