Horoscope: ఈ రాశుల వారిది అదృష్టం.. పెరిగిన ఆదాయం.. వారి రాశి ఫలాలు..
మార్చి 22, 2025 నాటి రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అలాగే పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మిథున రాశి వారికి రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల రాశి ఫలాలు ఇవే.
మేషరాశి:
వృత్తి మరియు ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో సన్నిహితుల నుంచి శుభవార్తలను వింటారు. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
వృషభరాశి:
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని పొందుతారు. వృత్తి మరియు వ్యాపారాలలో లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన సమాచారం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
మిథున రాశి:
వృత్తి మరియు ఉద్యోగాలలో ప్రశాంతత ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక విషయాలకు ఇది సరైన సమయం. ఎలాంటి ప్రయత్నం చేసిన ఫలితం అందుతుంది. రావలసిన డబ్బు చేతికే అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. స్నేహితుల సహకారంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
కర్కాటక రాశి:
వృత్తి మరియు ఉద్యోగాలపరంగా శుభవార్తలు విని అవకాశముంది. వ్యాపారంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆలస్యం అవుతున్న పనులు ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలుస్తాయి
సింహరాశి:
వృత్తి మరియు ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆస్తి వివాదం విషయంలో రాజీమార్గం ఎంచుకుంటారు. కుటుంబ జీవితం ఉల్లాసంగా ఉంటుంది.
కన్య రాశి:
వృత్తి మరియు ఉద్యోగ విషయాలలో సమయం సానుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. ఎలాంటి ప్రయత్నం చేసిన విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి ని సలహా తీసుకోవడం మంచిది. అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. అధిక వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.
తులా రాశి:
వృత్తి మరియు ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగుతాయి. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు ఉంటాయి. కుటుంబంలో శుభపరిణామాలు ఉంటాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలుస్తాయి. అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాలు కొలిక్కి వస్తాయి.
వృశ్చిక రాశి:
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆధర అభిమానాలు పెరిగే అవకాశం ఉంది. పనితీరుతో సంతృప్తి చెందుతారు. స్నేహితుల సహాయంతో అనుకున్న పని పూర్తవుతుంది. డాక్టర్లు మరియు లాయర్లకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.
ధనస్సురాశి:
ఉద్యోగంలో సానుకూల మార్పులు ఉంటాయి. డాక్టర్లు మరియు లాయర్లకు క్షణం కూడా తీరిక ఉండదు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అదనపు ఆదాయం ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. కుటుంబ సభ్యుల పై వ్యయం ఎక్కువయ్యే అవకాశం.
మకర రాశి:
వృత్తి మరియు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి. ప్రయాణాల వలన కూడా లాభాలు పొందుతారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం.
కుంభరాశి:
ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం అందుతుంది. వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది.
మీనరాశి:
ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు ఉంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.