Home తాజా వార్తలు Inter Result Date 2025: ఫ్లాష్..ఫ్లాష్…రేపే ఇంటర్ ఫలితాలు విడుదల…ఈజీగా ఇలా చెక్ చేసుకోండి

Inter Result Date 2025: ఫ్లాష్..ఫ్లాష్…రేపే ఇంటర్ ఫలితాలు విడుదల…ఈజీగా ఇలా చెక్ చేసుకోండి

Inter Result Date 2025
Inter Result Date 2025

Inter Result Date 2025: ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలు పూర్తి అయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభించింది. మార్చి 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాలలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం నాలుగు విడతలలో జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు. విద్యార్థుల మార్కులకు సంబంధించిన కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ వార్షిక పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ఇంటర్ పరీక్షలు పూర్తి అవడంతో ప్రస్తుతం విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ కలిపి దాదాపుగా 10 లక్షల పైగానే విద్యార్థులు ఈ పరీక్షలను రాసినట్లు సమాచారం. మీరందరూ కూడా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

పరీక్షలు ముగిసిన వెంటనే ఇంటర్ బోర్డు సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియను ప్రారంభించింది. మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ మొత్తం నాలుగు విడతలలో పూర్తి అయ్యింది. ప్రస్తుతం కంప్యూటరీకరణ ప్రాసెస్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం అనుకున్నట్లు జరిగితే ఫలితాలు మరో వారంలో ప్రకటిస్తారు అని తెలుస్తుంది. ప్రస్తుతము జవాబు పత్రాల మూల్యాంకన ప్రాసెస్ పూర్తి అవడంతో ఇంటర్ బోర్డు అధికారులు కంప్యూటరీకరణ ప్రాసెస్ చేస్తున్నారు.

విద్యార్థుల మార్కుల ఎంట్రీతోపాటు సాంకేతికపరమైన అంశాలను కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత ఇంటర్ బోర్డు అధికారులు అధికారిక వెబ్సైట్లో ప్రకటించనున్నారు. అలాగే ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా విద్యార్థులకు ఫలితాలను అందుబాటులోకి తీసుకొని రానున్నారు. ప్రస్తుతం ఈ ప్రాసెస్ చివరి దశలో ఉండడంతో ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ఏపీ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలు రేపు విడుదల కానున్నట్లు ప్రకటించారు.ఏప్రిల్ 12 ,శనివారం ఉదయం 11 గంటలకు నుంచి ఫలితాలను చూసుకోవచ్చు.ఇంటర్ ఫలితాలను విద్యార్థులు https ://resultsbie .ap .gov .in లో చెక్ చేసుకోవచ్చు.మన మిత్ర అనే వాట్సాప్ నెంబర్ 9552300009 అనే నెంబర్ కు Hi అని మెసేజ్ పంపి తక్షణమే ఫలితాలను పొందొచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now