IPL BATS CHECK: ఐపీఎల్ లో బ్యాట్లు ఎందుకు చెక్ చేస్తారో తెలుసా..?
ఐపీఎల్ 2025లో ప్రతి బ్యాటర్ క్రీజులోకి వచ్చేముందు బ్యాట్లను చెక్ చేస్తున్నారు. గతంలో కేవలం ట్రైనింగ్ సెషన్ లలో చెక్ చేసేవారు. ఇప్పుడేమో ప్రతి బ్యాటర్ క్రీజుకు వచ్చేముందు చెక్ చేయడం ప్రారంభించారు. ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాట్ విడ్త్, లెంగ్త్, సైడ్ ఎడ్జ్ లు ఎంత ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ కొంతమంది క్రికెటర్లు బ్యాట్లను మరి పెద్ద లెంగ్త్, సైడ్ ఎడ్జ్ లు తీసుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోనే సిక్సులు, ఫోర్లు బాగా బాదేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఎందుకిలా చేస్తున్నారంటే
ఒక్కో క్రికెటర్ వద్ద దాదాపు అర డజన్ బ్యాట్లైనా ఉంటాయి. మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్ లో ఇంతకు ముందు చెక్ చేసేవారు. అప్పుడు పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే ప్రాక్టీస్ సెషన్ లో చెకింగ్ చేసిన బ్యాట్.. మ్యాచ్ లో ఆడుతున్నట్లు ఎలా నిర్ధారిస్తారు. అందుకే ఇప్పుడు ఐపీఎల్ లో మొత్తం బ్యాటర్ల బ్యాట్లు చెక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బ్యాట్స్ మెన్ క్రీజులోకి వస్తున్నారంటే చాలు బ్యాట్ ను చెక్ చేసే గేజ్ పట్టుకుని అంపైర్లు చెక్ చేస్తున్నారు. ఆ తర్వాతే బ్యాటర్ ను ఆడేందుకు అనుమతిస్తున్నారు. ఇలా చెక్ చేసిన సమయంలో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ సునీల్ నరైన్ బ్యాట్ నిబంధనలకు అనుగుణంగా లేనట్లు తెలిసింది. దీంతో వేరే బ్యాట్ తెప్పించి బ్యాటింగ్ చేశాడు.
బ్యాట్ ఎంత కొలతలు ఉండాలంటే..
ఐపీఎల్ ఎంసీసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతోంది. దీని ప్రకారం ఒక బ్యాట్స్ మెన్ బ్యాట్ పొడవు, లెంగ్త్, విడ్త్, ఎడ్జ్ లు డిసైడ్ చేస్తారు. ఎంసీసీ గైడ్ లైన్స్ ప్రకారం.. ఎడ్జ్ థిక్ నెస్ మ్యాక్సిమమ్ 4 సెంటిమీటర్స్, ఓవరాల్ డెప్త్ మ్యాక్సిమమ్ 6.7 సెంటిమీటర్స్, విడ్త్ మ్యాక్సిమమ్ 10.8 సెంటిమీటర్స్ ఉండాలి. బ్యాట్ చెక్ గేజ్ నుంచి బ్యాట్ పూర్తిగా పాస్ అవుట్ కావాలి. గేజ్ ద్వారా చెకింగ్ చేసే సమయంలో అది వెళ్లలేకపోతే ఆ బ్యాట్ ను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు.