Jagityala: తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా

Jagityala
Jagityala

Jagityala: జగిత్యాల జిల్లా, ఆగస్టు15 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా పట్టణ కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద జాతీయ జెండా తలకిందులుగా ఎగిరింది. స్థానికంగా జనగణమన జిల్లా అధ్యక్షుడు ఊటూరి గంగాధర్ టవర్ సర్కిల్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథిగా డిఎస్పి రఘుచందర్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఉదయం పట్టణవాసుల సమక్షంలో డిఎస్పి జాతీయ జెండా ఎగరవేసే సమయంలో తలకిందులుగా ఎగరవేయడంతో నెటిజన్లు డిఎస్పీపై మండిపడుతున్నారు. ఉన్నత పోలీసు అధికారి సమక్షంలో జాతీయ జెండాకు అవమానం జరగడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరమని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు డిఎస్పి, నిర్వాహకులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి చేతుల మీదుగా జాతీయ జెండా తలకిందులుగా ఎగరడం స్థానికంగా చర్చనీ అంశమైంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now