Home తాజా వార్తలు MINISTER MILLS: పేదోడి బియ్యంతో తవ్వన్న ఇంట్లో మంత్రి బువ్వ..!

MINISTER MILLS: పేదోడి బియ్యంతో తవ్వన్న ఇంట్లో మంత్రి బువ్వ..!

MINISTER MILLS
MINISTER MILLS

MINISTER MILLS: ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 16 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేదలకు పంపిణీ చేసిన సన్న బియ్యంతో భోజనం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావునిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి లోని తవ్వన్న కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.

మంత్రి తో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ అందాన్, ఆర్డీవో రాజు, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇంచార్జిలు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, స్థానిక నాయకులు తవ్వన్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వమని ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం పేదోడి వరకు చేరుతోందో లేదో స్వయంగా వెళ్లి చూడాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో పేదల ఇంట్లో భోంచేసే కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం, పథకాలు పేదలకు చేరేవరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు పనిచేయాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now