Home తాజా వార్తలు Rythu Bharosa: ఫ్లాష్ ఫ్లాష్.. రైతులకు మంత్రి కీలక ప్రకటన.. పంట నష్టం, రుణమాఫీ డబ్బులు...

Rythu Bharosa: ఫ్లాష్ ఫ్లాష్.. రైతులకు మంత్రి కీలక ప్రకటన.. పంట నష్టం, రుణమాఫీ డబ్బులు త్వరలో మీ అకౌంట్లో..!

Rythu Bharosa
Rythu Bharosa

Rythu Bharosa: రాష్ట్ర మంత్రి తాజాగా రైతు భరోసా డబ్బులు పై కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన పంట నష్టం మరియు పంట రుణమాఫీ వంటి అంశాలపై కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం రైతు రుణమాఫీ కూడా చేసింది. రైతు భరోసా డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సన్నబియ్యం కొనుగోలుపై రైతులకు బోనస్ చెల్లించింది.

కానీ వీటి అమలు మాత్రం పక్కాగా జరగలేదని చాలామంది చెప్తున్నారు. అర్హులైన వాళ్లకి పూర్తిస్థాయిలో ప్రయోజనాలు అందలేదని చెప్తున్నారు. కొంతమంది రైతులు కూడా బహిరంగనే తమకు కొన్ని ప్రయోజనాలు లభించలేదని తెలిపారు. తాజాగా ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కూడా ఈ అంశాలపై స్పందించడం జరిగింది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనల మధ్య వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సోమవారం రోజు పంటల రుణాల మాఫీ అమలులో అలాగే రైతు భరోసా పంపిణీలో వైఫల్యాలను గురించి అంగీకరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఆర్థిక సహాయాన్ని మార్చి 31 లోపు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ గడువులోగా డబ్బులు జమ చేయలేదు.

ఈ క్రమంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొంత ఆలస్యం జరిగిందని సహాయం అందరిని రైతులకు త్వరలో అందిస్తామని తాజాగా నిజామాబాద్ లో జరిగిన రైతు మహోత్సవం కార్యక్రమంలో తెలిపారు. ఇటీవల కాలంలో అకాల వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో ఎండాకాలంలో అకాల వర్షాల వలన చాలామంది రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాల కారణంగా వరి మరియు మామిడి రైతులు అయితే కుదేలు అవుతున్నారు. మంత్రి తుమ్మల ఇటువంటి రైతులకు ఊరట కలిగే ప్రకటన చేశారు. ఎండాకాలంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతుల పంటలకు పరిహారం త్వరలోనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now