Vastu Tips: ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి రోడ్డు మీద వెళ్తున్న సమయంలో డబ్బులు లేదా నాణేలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా రోడ్డు మీద కనిపించిన డబ్బులను తీసుకోవాలా వద్దా అంటూ చాలామంది ఆలోచిస్తారు. కొంతమంది అలా దొరికిన డబ్బులు అన్ని తీసుకొని దేవుడి హుండీలో వేస్తారు. మరి కొంతమంది రోడ్డు మీద దొరికిన డబ్బులను పేదలకు ఇచ్చేస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే రోడ్డు మీద దొరికిన డబ్బులను తమ దగ్గర ఉంచుకుంటారు. అయితే రోడ్డుమీద దొరికిన డబ్బులను తీసుకోవడం మంచిదా కాదా ఇప్పుడు తెలుసుకుందాం.
రోడ్డుమీద నడుస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి డబ్బులు లేదా నాణేలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఏమీ ఆలోచించకుండా ఆ డబ్బులను తీసుకుంటారు. ఆ డబ్బులు దొరకడం తమ అదృష్టంగా భావిస్తారు. అయితే మరి కొంతమంది మాత్రం అలా దొరికిన డబ్బులను పేద వాళ్లకు దానం చేస్తారు. మరి కొంతమంది దొరికిన డబ్బులు ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతారు. అయితే రోడ్డుపై పడి ఉన్న విలువైన వస్తువులు కనిపించడం చాలా విషయాలను సూచిస్తుంది అంటూ నిపుణులు చెప్తున్నారు.
రోడ్డుపై పడి ఉన్న డబ్బులను తీసుకోవడం గురించి మన పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డుమీద వెళ్తున్నప్పుడు స్నానం కనిపిస్తే అది తీసుకోవడం శుభప్రదంగా చెబుతున్నారు. అలా రోడ్డుమీద నానం కనిపించడం అంటే పూర్వీకుల ఆశీర్వాదంగా భావిస్తారు. రోడ్డుమీద మీకు నాణెం కనిపిస్తే త్వరలో అక్కడ ఏదో కొత్త పని ప్రారంభం అవుతుందని అర్థం.
అంతేకాదు రోడ్డుమీద నానని కనిపిస్తే త్వరలో కొత్త ఉద్యోగం వస్తుందని అలాగే విజయాన్ని మరియు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. ఇలా జరిగితే లక్ష్మీదేవి మీ పట్ల సంతోషంగా ఉందని, అమ్మవారి అనుగ్రహంతో మీకు ఎక్కడ నుంచో సంపద పొందే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే రోడ్డు మీద వెళ్తున్న సమయంలో డబ్బు కనిపించడం శుభప్రదమే అయినా కూడా ఆ డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నవారికి ఇవ్వడం పుణ్యప్రదంగా చెబుతున్నారు.