Home తాజా వార్తలు Govt Hospital: నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి

Govt Hospital: నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి

Govt Hospital
Govt Hospital

Govt Hospital: మెట్ పల్లి, మార్చి29 (ప్రజా శంఖారావం): ప్రభుత్వ హాస్పిటల్ లో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి నూతన భవనం గురించి అసెంబ్లీలో చర్చించానని, త్వరగా పనులు పూర్తీ చేసి మెట్ పల్లి ప్రాంత ప్రజలకు అందుబాటులో తేవాలని కోరడం జరిగిందన్నారు.

ఆస్పత్రిలో మందుల కొరత ఉండటంతో వెంటనే TSMIDC అధికారులతో మాట్లాడి మందుల కొరత లేకుండ చూడాలని వృద్ధి కమిటీ వారికి సూచించారు. ఆస్పత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య పెరిగేలా గర్భిణులకు తగు సూచనలు చేయాలనీ డీఎంహెచ్ఓకి తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ తో మాట్లాడి ప్రభుత్వ ఆస్పత్రికి మరింత మంది వైద్యులని కేటాయించాలని చెప్పారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అసెంబ్లీలో, ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి హాస్పిటల్ నిర్మాణం పూర్తీ చేయాలనీ కోరారని అన్నారు. నూతన ఆస్పత్రి పనులు 2, 3 నెలల్లో ప్రారంభం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. పేద ప్రజలందరూ ప్రభుత్వ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now