Nandipet: నందిపేట్, ఆగస్టు 07 (ప్రజా శంఖారావం): నందిపేట్ మండలం అన్నారం గ్రామ శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కృష్ణ జింకలపై ఊర కుక్కలు దాడి చేయడంతో జింకలు తీవ్రంగా గాయపడ్డాయి. పంట పొలాల్లోకి వెళ్లే స్థానికులు ఇది గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.
వెంటనే స్థానిక వెటర్నరీ వైద్యులను పిలిపించి గాయపడ్డ కృష్ణ జింకలకు చికిత్స చేయించారు. ప్రస్తుతం కుక్కల దాడిలో గాయపడ్డ జింకలు మృతి చెందలేవని అధికారులు తెలిపారు. చికిత్స అనంతరం గాయపడ్డ జింకలను చిన్నాపూర్ అటవీలోని అర్బన్ పార్కు కు తరలించారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now