Trending AC: ఈ వేసవి కాలంలో భగభగ మండుతున్న సూర్యుని ఎండను తట్టుకోవడం ప్రతి ఒక్కరికి సవాలుగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఫెడస్టల్ ఫ్యాన్లు అలాగే మిస్ట్ ఫ్యాన్లు వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు. చిన్న స్థలాలను కూల్ చేయడానికి అయితే ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ పెద్ద స్థలాలను కూల్ చేయడం చాలా కష్టమైన పని. పెద్ద స్థలాల కోసం సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టం లను ఉపయోగిస్తారు. కానీ వాటిని ఉపయోగించడం వలన విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తాయి. ఇవి అందరికీ సాధ్యం కావు కాబట్టి తక్కువ ఖర్చుతో అధిక విద్య వినియోగం లేకుండా సహజంగా చల్లదనాన్ని అందించే ఒక విప్లవాత్మకమైన పరిష్కారం మనదేశంలో ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతుంది.
దీనిని టెర్రకోట పైపు కూలింగ్ ఎసి సిస్టం అంటారు. ఈ కూలింగ్ సిస్టం చిన్నచిన్న గదిలో నుంచి పెద్దపెద్ద స్థలాల వరకు కూడా సమర్థవంతంగా కూలింగ్ అందించగలదు. సహజ కూలింగ్ సిస్టంతో ఈ టెర్రకోట పైపు కూలింగ్ సిస్టం పనిచేస్తుంది. ఈ సిస్టంలో ముఖ్యంగా టెర్రకోట అంటే మట్టి పైపులను ఉపయోగిస్తారు. ఈ పైపులు వేడిని గ్రహించి చల్లని గాలిని బయటకు సరఫరా చేస్తాయి. అధిక విద్యుత్ ఆధారం లేకుండా అలాగే సాంకేతిక రసాయనాలు లేకుండా ఈ టెర్రకోట పైపు కూలింగ్ సిస్టం పనిచేస్తుంది.
దీనిని ఉపయోగించడం వలన పర్యావరణానికి కూడా ఎటువంటి హాని ఉండదు. ఈ సిస్టంలోని పైపులు వేడిగాలిని గ్రహించి ఆ గాలిని చల్లబరిచిన తర్వాత స్థలంలోకి రిలీజ్ చేస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం సహజంగా జరుగుతుంది కాబట్టి దీనికి విద్యుత్ వినియోగం కూడా దాదాపు శూన్యం అని చెప్పొచ్చు. దీని నిర్వహణ ఖర్చులు సాధారణ ఏసీల తో పోలిస్తే చాలా తక్కువ అని కూడా చెప్పచ్చు. సామాన్య ప్రజలకు కూడా ఇది చాలా బెస్ట్ ఎంపిక.