RBI: ఈ 3 నోట్లను ఇకపై ముద్రించేది లేదు.. స్పష్టం చేసిన RBI

RBI
RBI

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లకు సంబంధించి తాజాగా మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. తన వార్షిక నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై ఈ మూడు నోట్లను ముద్రించేది లేదు అంటూ స్పష్టంగా తెలిపింది. ఇటీవలే ఆర్బిఐ వార్షిక నివేదిక వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం చాలామందిలో ఉన్న కరెన్సీ నోట్లు అలాగే నాణేలకు సంబంధించి అతి ముఖ్యమైన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నివేదికలో తెలిపింది.

ఆర్బిఐ గత ఏడాది నుంచి 2000 రూపాయల నోటు చలామణి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం 3.56 లక్షల కోట్లలో మార్చి 2025 నాటికి 98.2% 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేసాయి. దీని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్లో అతి తక్కువ 2000 రూపాయల నోట్లు మిగిలి ఉన్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై 2,5,2000 రూపాయల నోట్లను ముద్రించేది లేదు అంటూ ప్రకటించింది.

దీనిపై ఆర్బిఐ స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో మన దేశంలో డిజిటల్ లావాదేవీలు అలాగే నాణేల వినియోగం పెరుగుతున్న సమయంలో మార్కెట్లో ప్రస్తుతం 500 రూపాయల నోటు ఎక్కువగా చలామణిలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం నుంచే మార్కెట్లో 2000 రూపాయల నోటును చలామణి నుంచి తొలగించేందుకు ఆర్బిఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో ఇప్పటివరకు 98.2% నోట్లు బ్యాంకుకు తిరిగి వచ్చాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఉన్న నోట్లలో 500 రూపాయల నోట్లు 40.9% ఉన్నాయి. ఇవి 86%తో అత్యధిక విలువ కలిగి ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now