SBI SCHEME: SBI సూపర్ స్కీం.. ప్రతినెల పొదుపు.. 5 ఏళ్లలో ఊహించని రిటరన్స్.. ఎంతో తెలుసా..!

SBI SCHEME
SBI SCHEME

SBI SCHEME: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్య మరియు మధ్య తరగతి ప్రజలు తమ పొదుపు చేసుకోవడానికి ఒక అద్భుతమైన పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు గరిష్ట వడ్డీరేట్లు పొందవచ్చు. కనిష్టంగా మీరు ఇందులో 100 రూపాయల నుంచి పొదుపు చేసుకోవచ్చు. రోజువారీ కూలీలు చేసే సామాన్య ప్రజలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న అద్భుతమైన పథకంలో మీరు ప్రతి నెల చిన్న మొత్తంలో పొదుపు చేసి అధిక వడ్డీ రేటుకు మంచి రాబడి పొందవచ్చు.

మీరు ఈ పథకంలో ప్రతినెలా పొదుపు చేయడం ద్వారా నిర్ణీత కాలానికి మంచి రాబడి పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో మీకు కనీస కాలపరిమితి 12 నెలల నుంచి గరిష్టంగా 120 నెలల వరకు అంటే ఐదేళ్లపాటు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులలో ఈ స్కీం అందుబాటులో ఉంది. కనిష్టంగా మీరు ఈ స్కీమ్ లో 100 రూపాయల నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ స్కీమ్లో మీరు ఇచ్చిన గడువు లోపల డిపాజిట్ చేయకపోతే మీకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఈ స్కీమ్లో 6 నెలల పాటు ఎటువంటి డిపాజిట్ చేయకపోతే మీ అకౌంటు క్లోజ్ కూడా అవుతుంది.

మిగిలిన బ్యాలెన్స్ను ఖాతాదారుడికి చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ రికరింగ్ డిపాజిట్ పథకంలో 100 రూపాయలు లేదా 500 రూపాయలు లేదా వెయ్యి రూపాయలు చొప్పున డిపాజిట్ చేసినట్లయితే అతను ఐదేళ్ల మెచ్యూరిటీ సమయానికి ఎంత అందుకుంటాడో ఇప్పుడు తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కి మీకు 6.50% వడ్డీ అందిస్తుంది. ఒక వ్యక్తి నెలకు వంద రూపాయలు చొప్పున పొదుపు చేసినట్లయితే ఐదేళ్లకు అతని పెట్టుబడి మొత్తం రూ.6 వేలు అవుతుంది. వడ్డీ రు.1,106 అవుతుంది. అంటే మొత్తం కలిపి రూ.7,106 అందుకోవచ్చు. ఒకవేళ ప్రతి నెల 500 రూపాయలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ సమయానికి రూ.35,528 పొందవచ్చు. ఒకవేళ ఈ స్కీమ్లో ప్రతినెలా 1000 రూపాయలు చొప్పున జమ చేసినట్లయితే మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.71,057 అందుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now