Post Office Scheme: కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ వర్గాల ప్రజల కోసం అనేక రకాల పొదుపు పథకాలను అమలులోకి తెచ్చింది. ప్రత్యేకంగా మహిళల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేసింది. ప్రస్తుతం కూడా ప్రభుత్వం మహిళల కోసం ఒక స్కీంను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీంలో మీరు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ.32 వేల వరకు వడ్డీ పొందవచ్చు. తక్కువ సమయంలోనే పోస్ట్ ఆఫీస్ లో ఈ మెచ్యూరిటీ స్కీం అందుబాటులో ఉంది. ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ వడ్డీని పొందవచ్చు.
వివాహితులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొని వచ్చిన పథకాలలో మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రారంభించింది. అయితే మహిళలు ఈ పథకం కింద ఖాతాలను తెరవవచ్చు. ఈ స్కీంలో మహిళలకు ఎంఎస్ఎస్సి పై 7.5% వడ్డీని అందిస్తున్నారు. అయితే ఈ పథకంలో మీరు కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
కేవలం రెండు సంవత్సరాలలో ఈ పథకం మెచ్యూరిటీ అవుతుంది. ఈ క్రమంలో ఖాతా తెరిచిన తేదీ నుండి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మీరు అర్హత ఉన్న బ్యాలెన్స్ లో 40 శాతం ఉపసంహరించుకోవచ్చు. మీరు మీ భార్య పేరు మీద ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఈ పథకం కింద మీరు రెండు లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయలేరు. రెండు లక్షల డిపాజిట్ పై మీకు 7.5% వడ్డీ అందుతుంది. ఈ విధంగా చూసుకుంటే మహిళకు మెచ్యూరిటీ సమయంలో రూ.2,32,044.00 అందుతుంది. అంటే ఈ పథకంలో మీ భార్యకు రెండు లక్షల డిపాజిట్ పై మొత్తం రూ. 32,044 వడ్డీ లభిస్తుంది.