Vastu Tips: ఈ వస్తువులు ఇంట్లో ఉంటే చాలా అశుభం.. వెంటనే తీసేయండి

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి. రాకింగ్ కుర్చీ ముందుకు వెనుకకు ఊగుతూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఇటువంటి కుర్చీని ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇంటి గోడలకు ఆకుపచ్చ రంగులో వేయకూడదు. ఇంట్లో గోడలకు ఆకుపచ్చ రంగును వేయడం అశుభాలను కలిగిస్తుంది అని వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు. పగిలిపోయిన గడియారాలను లేదా ఆగిపోయినా గడియారాలను ఇంట్లో పెట్టుకోకూడదు.

ఇటువంటివి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. మొక్కలలో బ్రహ్మజెముడు, నాగజెముడు అనే వాటిని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి చాలా అశుభాలను కలిగిస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా పరుపును సర్దుకోవాలి. లేకపోతే ఆ ఇంట్లో అరిష్టం వస్తుంది. ఫెంగ్ షై వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సరిగ్గా సర్దని పరుపు కారణంగా అన్ని అశుభాలు కలుగుతాయి. ఇంట్లో గొడుగులను ఎప్పుడు మోసే ఉంచాలి.

ఇంట్లో గొడుగులను తెరవకూడదు. అలాగే ఇంటి లోపల పెంచుకునే మొక్కలు అన్నీ కూడా ఎండిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఆ మొక్కలు అన్నీ కూడా పచ్చగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్న దాన్ని ప్రకారం ఇంట్లో పగిలిపోయిన వస్తువులు లేదా పనికిరాని వస్తువులు ఉంటే వాటిని వెంటనే తీసేయాలి. లేకపోతే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. ఆగిపోయిన గడియారాన్ని కూడా సరి చేస్తూ ఉండాలి. ఒకవేళ గడియారం పగిలిపోయినట్లయితే వెంటనే దానిని తీసి పడేయాలి. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన కూడా ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now