Suicide:ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య..!

Suicide
Suicide

Suicide: మెట్ పల్లి, ఆగస్టు 13 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆర్ బి రెస్టారెంట్ లాడ్జిలో తెల్లవారుజామున ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన బాలి రాజేందర్ (48) గత కొద్ది రోజులుగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో సిమెంట్, ఐరన్ వ్యాపారo చేస్తూ వ్యాపారంలో నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మంగళవారం తెల్లవారుజామున మెట్ పల్లిలోని ఆర్ బి రెస్టారెంట్ లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపారు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారని చెప్పారు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now