Bangaram Child Artist: బంగారం సినిమా చిన్నారి ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు

Bangaram Child Artist
Bangaram Child Artist

Bangaram Child Artist: ఒకప్పుడు తెలుగు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన చాలామంది ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్లుగా మారి తమ సత్తా చాటుతున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమ చదువులపై దృష్టి పెడుతున్నారు. కానీ వీళ్లు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తమ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు తన కెరియర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో బంగారం సినిమా కూడా ఒకటి.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకు రిజల్ట్ ఎలా వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన స్టైల్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. అప్పట్లో ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ధరణి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో అతిథి పాత్రలో హీరోయిన్ త్రిష కనిపించింది. బంగారం సినిమాలో జర్నలిస్టు పాత్రలో తన అద్భుతమైన నటనతో మరోసారి పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను కట్టిపడేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు మీరా చోప్రా మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్వించాయి.

ఇక ఈ సినిమాలో మీరా చోప్రా చెల్లెలి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈమె పేరు సనూష సంతోష్. సనూష తమిళ్లో పలు సినిమాలలో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే సనూష నిత్యం తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ సనూష తెలుగులో బంగారం సినిమా తర్వాత మరొక సినిమాలో కనిపించలేదు. బంగారం సినిమా తర్వాత కోలీవుడ్లో కొన్ని సినిమాలలో నటించిన సనుష ఆ తర్వాత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతం సనూష సంతోష్ ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now