Todays Horoscope: ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి…12 రాశుల వార ఫలాలు ఇవే

Horoscope Today
Horoscope Today

Todays Horoscope: మే 4 నుంచి మే 10, 2025 మేష రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వృషభ రాశి వారి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వార ఫలాలు ఇవే.

మేష రాశి: ఈ వారం అంతా సాఫీగా సాగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా లాభాలు ఇస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వలన బాగా లాభాలు పొందుతారు. ఖర్చులను తగ్గించుకోవాలి. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆదాయానికి మరియు ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పొందుతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.

వృషభ రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారంలో తీరిక ఉండదు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకూడదు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.

మిథున రాశి: ఈ వారం అంతా వీరికి సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తిగా అవుతాయి. అనేక రకాలుగా ఆదాయం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభపరిణామాలు జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆస్తివివాదం పరిష్కారం అవుతుంది.

కర్కాటక రాశి: ఈ వారం అంత వీరికి అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా పురోగతి లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థికపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మీద అధికారులు ఆధారపడతారు.

సింహరాశి: ఆదాయం బాగా పెరుగుతుంది. శ్రమ తక్కువగా లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటా బయట అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఈ వారం బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆస్తిపరంగా తండ్రి వైపు నుంచి శుభవార్తలు వింటారు. రాజకీయ ప్రముఖులత పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య రాశి: వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీ సమర్థతకు మంచి గుర్తింపు ఉంటుంది. అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. అనారోగ్య సమస్యలు మరియు వైద్య ఖర్చులు తప్పవు. నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి.

తులారాశి: ఈ వారం అంతా వీరికి సంతోషంగా గడిచిపోతుంది. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఇంటా బయట విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాల వలన అధికారులకు లాభం కలుగుతుంది. కుటుంబంలో శుభపరిణామాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి: ముఖ్యమైన పనులను శ్రమతో పూర్తి చేస్తారు. వ్యక్తిగతంగా చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పడతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా జరుగుతాయి. కొద్దిపాటి శ్రమతో ఎక్కువ లాభాలను పొందుతారు. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. వ్యాపారంలో బాగా లాభాలు పొందుతారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.

ధనస్సు రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో శుభ పరిణామాలు జరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అంచనాలకు నుంచి ఆదాయంలో పురోగతి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఖర్చు పెరుగుతుంది. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు.

మకర రాశి: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులలో జాగ్రత్త వహించాలి. గృహ మరియు వాహన పర్యటనలు అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. మిత్రుల వలన ఆర్థికంగా నష్టపోతారు.

కుంభరాశి: ప్రతి పనిలో కూడా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో శుభపరిణామాలు జరుగుతాయి. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. శత్రు, రోగ మరియు రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. సమీప బంధువుల వలన సమస్యలు ఏర్పడతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.

మీనరాశి: ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు. కుటుంబంలో ఆందోళన తప్పదు. ఉద్యోగంలో సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం మరియు ఆదాయం బాగుంటాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. బంధుమిత్రులకు మీ సలహాలు బాగా ఉపయోగపడతాయి. ఆర్థికపరంగా వాగ్దానాలు చేయకూడదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now