Todays Gold Rate: ఏకంగా రూ.19 వేలు తగ్గబోతున్న పసిడి ధర.. కారణం ఇదే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: గడిచిన కొన్ని రోజుల నుంచి బంగారం ధరలలో స్థిరంగా పెరుగుదలను చూస్తున్నాము. లక్ష రూపాయలను దాటి తులం బంగారం ధర కొంచెం వెనక్కి వచ్చింది. ప్రస్తుతం బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో బంగారం ధర ఏకంగా 19వేల రూపాయలు తగ్గే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం బంగారం ధర ఒక తులానికి లక్ష రూపాయలు దాటింది. ప్రస్తుతం ఇతర దాదాపు ఏడు నుంచి తొమ్మిది వేల వరకు తగ్గింది.

ఇక రాబోయే నాలుగు నుంచి ఆరు నెలలలో బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి 19000 తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. కేడియో అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా రానున్న నాలుగు నుంచి ఆరు నెలలలో బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి దగ్గి 80 వేలకు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న రోజులలో బంగారం ధర తులానికి 80 నుంచి 85 వేలకు చేరుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మనదేశంలో దిగుమతి ఒప్పందం పెంచడం వలన కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ దిగుమతి ఒప్పందాలపై భిన్నమైన వైఖరిని చూపిస్తున్న క్రమంలో ప్రపంచ దేశాల మార్కెట్లలో కూడా స్థిరత్వం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బంగారం ధరలో కూడా తగ్గుదల కనిపిస్తుంది. ఈ పరిస్థితులన్నిటిని పరిశీలిస్తే భవిష్యత్తులో బంగారం ధర 80 వేలకు తగ్గవచ్చని తెలుస్తుంది. బంగారం ధరలో నిరంతర హెచ్చుతగ్గలు కనిపిస్తున్నాయి. బంగారం పెట్టుబడిలో జనవరి నెలలో 21 శాతం రాబడిని పొందారు. ఒక ఏడాదిలో బంగారం దాదాపు 32 శాతం రాబడిని అందించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్రిక్తతలు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచ ఉధృతితలు తగ్గిన నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now