Home ఆధ్యాత్మికం Vastu Tips: ఈ వస్తువులను పొరపాటున కూడా ఇతరుల నుంచి తీసుకోకూడదు.. తీసుకుంటే సమస్యలు తప్పవు

Vastu Tips: ఈ వస్తువులను పొరపాటున కూడా ఇతరుల నుంచి తీసుకోకూడదు.. తీసుకుంటే సమస్యలు తప్పవు

Vastu Tips
Vastu Tips

Vastu Tips: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో ఉంచినా కొన్ని వస్తువులు ఆ ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొని వస్తే పొరపాటున పెట్టినా కొన్ని వస్తువులు మాత్రం ఆ ఇంట్లో ప్రతికూల శక్తిని తెచ్చిపెడతాయి. ఇంట్లో ప్రతికూల శక్తి ఉండడం వలన ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముడతాయి. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువుల విషయంలో జాగ్రత్త పాటించాలి.

కొన్ని వస్తువులను పొరపాటున కూడా వేరొకరి దగ్గర నుంచి అడిగి తీసుకోకూడదు. అలాగే వాటిని ఎక్కువసేపు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇతరుల దగ్గర నుంచి తీసుకునే కొన్ని వస్తువుల వలన కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫర్నిచర్ ఉంటుంది. కొంతమంది తమ ఇంట్లో కొత్త ఫర్నిచర్ తెచ్చుకున్న తర్వాత పాత ఫర్నిచర్ ను ఇతరులకు ఇచ్చేస్తారు. ఈ విధంగా ఇతరులనుంచి పాత ఫర్నిచర్ మీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆ ఫర్నిచర్ తో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

అలా రావడం వలన ఆ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అలాగే కొంతమందికి ఇతరులు ధరించిన బూట్లు లేదా చెప్పులు నచ్చితే వాటిని ధరించే అలవాటు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాదాలు ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయి. కాబట్టి వేరొకరి చెప్పులు లేదా బూట్లను ధరించి ఇంట్లోకి వెళ్తే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. పొరపాటున కూడా ఇతరుల చెప్పులను ధరించకూడదు. అలాగే వాన సమయంలో రక్షణ ఇచ్చే గొడుగులు కూడా ప్రతికుల శక్తిని ఇస్తాయని వాస్తు శాస్త్రం ప్రకారం చెప్తారు. కాబట్టి ఇతరుల గొడుగును ఇంట్లోకి తీసుకొని వెళ్లడం చాలా అశుభంగా చెబుతారు. ఒకవేళ అవసరానికి మీరు ఇతరుల గొడుగు ఉపయోగించినా కూడా దానిని ఇంట్లోకి తీసుకొని వెళ్లకూడదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now