Weekly Horoscope: వీరికి ధన యోగం కలుగుతుంది.. 12 రాశుల వార ఫలాలు ఇవే

Weekly Horoscope
Weekly Horoscope

Weekly Horoscope: మే 25 నుంచి మే 31, 2025 మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వార ఫలాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: కొద్దిగా ప్రయత్నించడం వలన ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రయత్నించడం వలన ఆస్తి వ్యవహారాలు కూడా చక్కబడతాయి. ఆదాయం మరియు ఆరోగ్యం బాగుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. వృత్తి మరియు ఉద్యోగంలో బిజీగా ఉంటారు. కుటుంబ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. చేతికి రావలసిన డబ్బు వస్తుంది.

వృషభ రాశి: ఆదాయం క్రమక్రమంగా బాగా పెరుగుతుంది. అనేక మార్గాలలో ఆదాయం ఉంటుంది. ఉద్యోగ జీవితం సంతోషంగా సాగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథున రాశి: ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. హోదా పెరుగుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో బాగా లాభాలు పొందుతారు. విదేశాలలో నుంచి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాల వలన లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి: అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు మరియు స్పెక్యులేషన్ల వలన బాగా లాభాలు పొందుతారు. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

సింహరాశి: ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. శుభ పరిణామాలు జరుగుతాయి. జీవిత భాగస్వామి మధ్య అపార్ధాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగించే అవకాశం ఉంది. విదేశాల నుంచి నిరుద్యోగులు ఆఫర్లు పొందుతారు. ఆర్థిక విషయాలలో వాగ్దానాలు చేయకూడదు. వృత్తి మరియు ఉద్యోగంలో పురోగతి పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.

కన్యారాశి: ధనయోగం కలుగుతుంది. వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు ఉంటుంది. పదోన్నతి పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలో మారుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు.

తులారాశి: అనేక రకాలుగా అదృష్టం కలిగి ఆదాయం పెరుగుతుంది. షేర్లు స్పెక్యులేషన్ ల వలన బాగా లాభాలు పొందుతారు. అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ వారం అంతా శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు మరియు నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి. తండ్రి వైపు నుంచి బాగా ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏ పని చేసిన విజయం పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నమ్మకం పొందుతారు. వృత్తి మరియు వ్యాపారంలో డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఉద్యోగంలో బాగా ఎదుగుతారు. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు బాగా పొందుతారు. కొన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి. స్నేహితుల వలన డబ్బు నష్టం జరుగుతుంది. ఆస్తి వివాదాలలో తొందరపడకపోవడం ఉత్తమం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వృత్తి మరియు ఉద్యోగంలో సాఫీగా సాగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది.

ధనస్సు రాశి: అనేక రకాలుగా ఆర్థిక లాభం పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శుభ పరిణామాలు జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి మరియు ఉద్యోగంలో హ్యాపీగా సాగుతాయి. అధికారుల ఆదరణ పొందుతారు. అనుకోని కొన్ని ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి.

మకర రాశి: ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి మరియు ఉద్యోగంలో పదోన్నతి కలగడంతో పాటు జీతభత్యాలు కూడా పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి.

కుంభరాశి: ఈ వారం అంతా సాఫీగా సాగుతుంది. ఆదాయం మరియు ఆరోగ్యం బాగుంటాయి. ఉద్యోగంలో అధికారుల నమ్మకం పొందుతారు. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. విదేశాలలో ఉద్యోగం పొందుతారు. పెళ్లి ప్రయోజనాలలో విదేశీ సంబంధం కుదురుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇవి అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి.

మీన రాశి: కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. శుభ పరిణామాలు జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. షేర్లు స్పెక్యులేషన్లలో బాగా లాభాలు పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. దూరప్రాంతాలలో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now