This Week Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఉండవు.. ఈవారం 12 రాశుల రాశి ఫలాలు..
ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 12, 2025 వరకు మేషరాశి నుంచి మీన రాశి వరకు వార ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారం అంతా మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వార ఫలాలు ఇవే.
మేష రాశి:
శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయ స్థానంలో కుజుడు మరియు ధన స్థానంలో గురువు ఉండడం వలన కొన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. ఏ పని చేసిన పూర్తి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల బాధ్యతను పంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభ రాశి:
శుభవార్తలు ఎక్కువగా వింటారు. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న పనులను సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. వృత్తి మరియు ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
మిధున రాశి:
వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. ఉద్యోగం ప్రోత్సాహకరంగా సాగుతుంది. పదోన్నతులు లభిస్తాయి. ఆర్థిక విషయాలలో కీలకమైన నిర్ణయాలను అమలు చేస్తారు. ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. ఎవరికీ కూడా వాగ్దానాలు చేయకూడదు.
కర్కాటక రాశి:
ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆస్తి విలువ పెరగడం, సొంత ఇంటి ప్రయత్నాలు వంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్య నామాలు చోటు చేసుకుంటాయి. శుభకార్యం జరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.
సింహరాశి:
ఆర్థిక వ్యవహారంలో జాగ్రత్త వహించాలి. నమ్మకద్రోహం మోసం, ధన నష్టం వంటివి కలిగే అవకాశం ఉంది. వృత్తి మరియు వ్యాపారం ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ప్రయోజనాలను అందిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. శుభవార్తలు వినే అవకాశముంది.
కన్య రాశి:
అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ పని చేసినా కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలు చెక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో ఉత్సాహంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.
తులారాశి:
ఉద్యోగంలో ప్రాధాన్యం లభిస్తుంది. అధికార యోగం కలుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరుగుతాయి. అంచనాలకు మించి వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అని కాదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరి అవకాశం ఉంది. ఇంట మరియు బయట ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
వృశ్చిక రాశి:
ఆదాయానికి లోటు ఉండదు. ఆశించిన స్థాయిలో ఆదాయ మార్గాలు లాభాలను ఇస్తాయి. శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. ఆరోగ్య మీద శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది.
ధనస్సు రాశి:
శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆర్థిక, ఆరోగ్య మరియు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి మరియు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారం ఆశాజనకంగా సాగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. అదన పాదాయ మార్గాలు లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి:
ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు. వృత్తి మరియు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టుల కారణంగా బాధ్యతలు పెరుగుతాయి. అనేక ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభరాశి:
ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక మరియు కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీ పనితీరుతో ఉద్యోగంలో అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మీన రాశి:
ఆర్థిక మరియు వ్యక్తిగత విషయాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలి. బంధువులను, సన్నిహితులను గుడ్డిగా నమ్మకూడదు. కొందరి మూలంగా ఆర్థికంగా నష్టపోతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం. నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెడతారు. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడరు. ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి.