Home బిజినెస్ RATION CARDS: రేషన్ కార్డు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్.. ఆ తర్వాత ఏం...

RATION CARDS: రేషన్ కార్డు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్.. ఆ తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు

RATION CARDS
RATION CARDS

RATION CARDS: ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత బలంగా చేసేందుకు ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డును కొంతమంది తప్పుడు మార్గంలో వినియోగించుకోవడం అలాగే నకిలీ కార్డులను పొందడం, అర్హత లేని వాళ్ళు రేషన్ తీసుకోవడం వంటి చాలా కేసులు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత మెరుగ్గా మరియు పారదర్శకంగా మార్చేందుకు కొన్ని కీలక చర్యలను తీసుకుంటుంది. జూన్ 30, 2025 నాటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. లబ్ధిదారులు గడువు సమయం వరకు రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే ప్రభుత్వము వారి రేషన్ కార్డును రద్దు చేయనుంది.

ఆ తర్వాత వారికి భవిష్యత్తులో ఉచిత లేదా చౌకైన ధరలకు రేషన్ లభించడం కుదరదు. ఇటీవల కాలంలో చాలామంది అనర్హులు రేషన్ పొందడం అలాగే నకిలీ రేషన్ కార్డులను తయారు చేయడం వంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారుడు మరణించిన తర్వాత కూడా అతని పేరు మీద అతని కుటుంబ సభ్యులు రేషన్ తీసుకోవడం వంటి కొన్ని కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మోసాలు అన్నిటికీ ఆనకట్ట వేయడానికి ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ కేవైసీ ప్రక్రియ తప్పనిసరిగా చేసింది. ఆధార్ కార్డు ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ జరుగుతుంది.

వీటిలో రేషన్ కార్డు యజమానితోపాటు అతని కుటుంబ సభ్యులందరి ధృవీకరణ కూడా నమోదయి ఉంటుంది. ఈ కేవైసీ ప్రక్రియ చేయడం వలన రేషన్ ప్రయోజనం సరైన మరియు అర్హులైన వారికి మాత్రమే చేరుతుందని నిర్ధారణ అవుతుంది. గతంలో ప్రభుత్వం మార్చి 31, 2025 రేషన్ కార్డ్ ఈ కేవైసీ ప్రక్రియకు చివరి తేదీగా ప్రకటించింది. కానీ చాలామంది ఆ సమయంలో అనేక సాంకేతిక సమస్యలను అలాగే సమాచారం లేకపోవడాన్ని వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి జూన్ 30, 2025 వరకు గడువు పొడిగించింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now