Home బంగారం ధర Todays Gold Rate: బంగారం ధరల దోబూచులాట.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

Todays Gold Rate: బంగారం ధరల దోబూచులాట.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: బంగారం ధరల దోబూచులాట.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

మన దేశ సంప్రదాయంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా సందర్భం ఏమైనా కూడా మహిళలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈరోజు జూన్ 8వ తేదీన బంగారం ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. ప్రతిరోజు కూడా బంగారం ధరలలో మార్పులు జరుగుతున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు తగ్గితే మరికొన్ని రోజులు పెరుగుతూ ఉన్నాయి. మిగిలిన అన్ని దేశాలతో పోలిస్తే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కూడా మార్కెట్లో వాటికి డిమాండ్ బాగా ఉంటుంది. అయితే జూన్ 8వ తేదీన బంగారం ధరలు భారీగా తగ్గినట్లు సమాచారం. నిన్నటితో పోలిస్తే ఈరోజు తులం పసిడిపై ఏకంగా 1600 రూపాయలు తగ్గింది.

తగ్గిన బంగారం ధరలు..

గత రెండు మూడు రోజుల క్రితం లక్ష రూపాయలు దాటిన తులం బంగారం ధర ప్రస్తుతం దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.97,970, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,000. ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ.98,120, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.89,950 గా ఉన్నాయని సమాచారం. ఇక ముంబై నగరంలో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.97,970, 22 క్యారెట్ల ధర రూ.89,000 గా ఉంది. బెంగళూరు నగరంలో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.97,970, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.89,800 గా ఉంది. ఇక దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో ఈరోజు కిలో వెండి 1,08,000గా ఉంది. ప్రాంతాలను బట్టి వీటి ధరలలో మార్పు ఉంటుంది అన్న సంగతి గుర్తించగలరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now