Todays Horoscope: ఈరోజు 18 ఏప్రిల్, 2025 మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశి: ఆర్థిక విషయాలకు మరియు ఆదాయం వృద్ధి చెందడానికి సమయం అనుకూలంగా ఉంది. అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. పొదుపుల మీద దృష్టి పెట్టాలి. అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి అవుతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారంలో కీలక మార్పులు చేసి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు అందుతాయి.
వృషభ రాశి: ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వృత్తి మరియు వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఆదాయం వృత్తి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. బంధువుల సహకారంతో పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. షేర్లు, స్పెక్యులేషన్ల వలన లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తుంది.
మిధున రాశి: మీ పనితీరుతో ఉద్యోగంలో అధికారులను ఆకట్టుకుంటారు. పదోన్నతి లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారం అనుకూలంగా సాగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు ఆసాజనకంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
కర్కాటక రాశి: ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. వృత్తి మరియు వ్యాపారం నిలకడగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సమర్థవంతంగా పూర్తవుతాయి. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన బాకీలు వస్తాయి. సోదరులతో ఉన్న వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
సింహరాశి: వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మీ మీద ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులకు సమయం అనుకూలంగా ఉంది. కొన్ని మార్పులు చేసి వ్యాపారంలో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కొందరు స్నేహితుల వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
కన్యారాశి: స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అనేక ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి మరియు ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
తులారాశి: ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. కొత్త బాధ్యతలను తీసుకుంటారు. వృత్తి మరియు వ్యాపారంలో సమస్యలను అధిగమించి లాభాలను పొందుతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా జరుగుతాయి.
వృశ్చిక రాశి: ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి మరియు వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలను వింటారు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాలలో ఎవరికి హామీలు ఇవ్వకపోవడం మంచిది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
మకర రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో మీ సమర్థతకు మించిన గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు ఎక్కువ విలువ ఇస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి లోతు ఉండకపోవచ్చు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.
కుంభరాశి: ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారం అభివృద్ధి చెందుతాయి. బంధువుల నుంచి పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
మీన రాశి: ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.