POLICE RIDINGS: అక్రమ వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై సోదాలు

POLICE RIDINGS
POLICE RIDINGS

POLICE RIDINGS: నిజామాబాద్ జిల్లా, ఏప్రిల్ 17 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్ డివిజన్ లలోని అక్రమ వడ్డీ వ్యాపారస్తుల ఇల్లు, కార్యాలయాలపై పోలీసులు గురువారం సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ అమాయక జనాల వద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తూ చలామణి అవుతున్న కొంతమంది పెద్దమనుషుల ఇళ్లపై, కార్యాలయాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

ఈ తనిఖీలను జిల్లా పోలీసు కమిషనర్ చైతన్యకుమార్ ఆదేశాలతో ఈ సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలోని కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లపై పోలీసులు సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సోదాల్లో పలు కీలకమైన పత్రాలు లభ్యమైనట్లుగా సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొంతమంది ప్రముఖులు అక్రమ వడ్డీల వసూలుకు పాల్పడుతున్నారనీ వచ్చిన ఫిర్యాదుల మేరకు వారిపై ఇళ్లు, కార్యాలయాలపై క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు సమాచారం. జిల్లా కమిషనర్ అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై చేస్తున్న సోదాలు కొంతమంది గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now