Todays Horoscope: ఈ రాశి వారి ఆదాయం రెట్టింపు.. నేడు 12 రాశుల దిన ఫలాలు..
నేడు ఏప్రిల్ 10, 2025 నాటి రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారు ఆర్థిక విషయాలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి వారి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇవే…
మేష రాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో ఎప్పటినుంచ ఎదురుచూస్తున్న మార్పులు జరుగుతాయి. వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి. ఆర్థిక విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు.
వృషభ రాశి:
ఉద్యోగంలో అధికారుల అంచనాలకు తగినట్టు పనులను పూర్తిచేస్తారు. వృత్తి మరియు వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రయత్నంలో లాభాలు వస్తాయి. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది.
మిథున రాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఎక్కువగా అలాగే లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టిన పూర్తవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వలన చాలా లాభాలు పొందుతారు. కొందరు స్నేహితుల వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కర్కాటక రాశి:
ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి జీతభత్యాల విషయంలో శుభవార్త వింటారు. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక విషయంలో ఎవరిని నమ్మకూడదు. ఆస్తి విషయంలో ఉపశమనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి.
సింహరాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూలంగా ఉంది. వృత్తి మరియు వ్యాపారంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ కుటుంబ ఖర్చులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో ఇతరులకు మాట ఇవ్వకపోవడం మేలు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది.
కన్య రాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందే అవకాశం ఉంది. ఇంట మరియు బయట ఆశించిన స్థాయిలో గుర్తింపు దొరుకుతుంది. మీరు తీసుకున్న ఆలోచనల వల్ల వ్యాపారంలో లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులు అన్ని పూర్తవుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులన్నీ లాభం తెచ్చి పెడతాయి.
తులారాశి:
ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. షేర్ల మీద పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి:
మృతి మరియు ఉద్యోగంలో ఒత్తిడి మరియు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం కూడా బాగానే ఉంటుంది.
ధనస్సు రాశి:
ఆదాయం పెరుగుతుంది. షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వల్ల లాభాలను పొందుతారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆధార అభిమానాలు దొరుకుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. ఆదాయం పెరుగుతుంది. అనేక ఆదాయం మార్గాలు విస్తరిస్తాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
మకర రాశి:
అన్ని పనులలో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి శ్రమతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. వృత్తి మరియు వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ముందుకు సాగుతాయి. మీ పనితీరుతో ఉద్యోగంలో అధికారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు వస్తాయి.
కుంభరాశి:
ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న సమయంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
మీనరాశి:
దాదాపు అన్ని ప్రయత్నాలు పూర్తి అవుతాయి. వృత్తి మరియు ఉద్యోగం అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో ఘనవిజయం సాధిస్తారు. వ్యాపారంలో అంచనాలకు మించిన లాభాలను పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది.