Viral Video: పాలతో చేసే టీ తాగి ఉంటారు కానీ.. ఈ మహిళ కొబ్బరి నీళ్ళతో టీ చేయడంపై.. వీడియో వైరల్

Viral Video
Viral Video

Viral Video: చాలామంది టీ ని ఇష్టపడతారు. కొంతమందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా టీ ప్రియులు అయితే రోజులో ఎన్ని కప్పుల టీ అయినా సరే తాగడానికి ఇష్టపడతారు. టీ లో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటిలో బ్లాక్ టీ, హెర్బల్ టీ, గ్రీన్ టీ, స్పైస్ టి వంటి రకాలు ఉంటాయి. చివరకు కొంతమంది పచ్చిమిర్చి టీ కూడా తాగుతారు. కానీ మీరు కొబ్బరి నీళ్లు తాగి ఉండరు. రీసెంట్ గా ఒక మహిళ కొబ్బరినీళ్ళతో టీ తయారు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ మహిళ మామూలు నీటితో కాకుండా కొబ్బరినీళ్ళతో టి తయారు చేస్తుంది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆమె ఇంకా ఏం చేస్తుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా అయితే ప్రతి ఒక్కరు కూడా పాలు, నిరు వాటిలో తేయాకు కలిపి టీ తయారు చేస్తారు. కానీ ఒక మహిళ చాలా వినూత్నంగా ఆలోచించి కొబ్బరినీళ్ళతో టీ ను తయారు చేయడం సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటుంది.

అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంస్టాగ్రామ్ లో hetals_art అని ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియోలో ఒక మహిళ ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక కొబ్బరి బోండాన్ని పెట్టింది. ఆ కొబ్బరి బొండం లో కొబ్బరి నీళ్లు ఉన్నాయి. ఆ కొబ్బరి నీళ్లలో పాలు, చక్కెర, టీ పొడి వేసి టీ ని తయారు చేసింది. ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో ఏప్రిల్ రెండవ తేదీన షేర్ చేయబడింది. ఈ వీడియోని చూసిన వాళ్ళు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 2.5 లక్షల మంది వీక్షించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now