LIC: పిల్లల కోసం మనీ బ్యాక్ పాలసీ.. ఎల్ఐసీ లో సూపర్ పాలసీ.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా…!

LIC
LIC

LIC: మైనర్ పిల్లల కోసం ఎల్ఐసి లో చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ పాలసీ ద్వారా 0 నుంచి 12 ఏజ్ పిల్లలకు ఇన్సూరెన్స్ కవరేజ్ తో పాటు ప్రీమియం వేవర్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అలాగే ఈ పాలసీ 25 ఏళ్ల వరకు కంటిన్యూ అవుతుంది. ఎల్ఐసి లో చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ తీసుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయి. తాజాగా ఈ పాలసీలో ఉండే కండిషన్స్ గురించి లోకల్ 18 తో నిజామాబాద్ ఎల్ఐసి కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ కాశీనాథ్ తెలిపారు. ఎల్ఐసి లో సామాన్య ప్రజలను మరియు మైనర్ పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలు అందుబాటులోకి వస్తున్నాయి.

అందులో భాగంగానే తాజాగా ఎల్ఐసి లో చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ పాలసీ కూడా అమలులోకి వచ్చింది. ప్రత్యేకంగా ఇది మైనర్ పిల్లల కోసం రూపొందించబడింది. ఈ పాలసీ జీరో నుంచి 12 సంవత్సరాల మైనర్ పిల్లలకి డిజైన్ చేయడం జరిగిందని ఇటీవలే ఎల్ఐసి కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ కాశీనాథ్ చెప్పుకొచ్చారు. ఈ పాలసీలో రెగ్యులర్గా బోనస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పాలసీలో చేరిన మైనర్ పిల్లలకి వాళ్లు అనుకున్న టైంలో మెచ్యూరిటీ టైం కి కచ్చితంగా మెచ్యూరిటీ డబ్బు మొత్తం అందుతుంది.

పిల్లల భవిష్యత్తు చాలా సేఫ్ గా ఉండే విధంగా ఈ పాలసీని ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఒకవేళ మీ పిల్లలు జీరో ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఈ పాలసీని తీసుకున్నట్లయితే రెండు సంవత్సరాల తర్వాత వాళ్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ప్రారంభం అవుతుంది. ఒకవేళ మీ పిల్లలకు ఎనిమిది సంవత్సరాలు తర్వాత మీరు ఈ పాలసీ తీసుకున్నట్లయితే వాళ్లకు వెంటనే రిస్క్ కవరేజ్ అనేది ప్రారంభం అవుతుంది. మైనర్ పిల్లల కోసం డిజైన్ చేసిన ఈ పాలసీలో వేవర్ బెనిఫిట్ అనే ఒక ప్రత్యేక ఆప్షన్ కూడా ఉంటుంది. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు ఈ ప్రీమియం కడతారు. ఒకవేళ ఇందులో ఏదైనా రిస్క్ అయితే ఈ పాలసీ రన్నింగ్ లో ఉన్న సమయంలో కూడా మీరు ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now