Todays Gold Rate: గుడ్ న్యూస్…తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు తులం ఎంత అంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు పరుగులు పెడుతూ సామాన్యులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మనదేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న క్రమంలో బంగారం కొనుగోలు చేయడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. కానీ మార్కెట్లో పెరుగుతున్న ధరలు బంగారం కొనేవారికి షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

గతంలో లక్ష నుంచి రూ.95,000 వరకు దిగివచ్చిన బంగారం ధరలు మళ్ళీ వారం రోజులలోనే 98 వేల కు చేరుకున్నాయి. ఇక ఈరోజు స్వల్పంగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మే 27, 2025 మంగళవారం రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.97,630 ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,490 గా ఉన్నాయి. తులం బంగారం పై పది రూపాయలు ధర పెరిగింది. అలాగే ఈరోజు కిలో వెండి ధరపై రూ.100 రూపాయలు పెరిగింది.

బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..

హైదరాబాద్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.97,630, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.89,490. కిలో వెండి రూ.1,11,100.

ఇక విజయవాడ, విశాఖపట్నం, ముంబై, చెన్నై మరియు బెంగళూరు నగరాలలో ఈరోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 97630, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,490, ఇక కిలో వెండి రూ.1,11,100 గా ఉన్నాయి.

మన దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.97,780, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.89,640, కిలో వెండి రూ.1,00,100 గా ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now