Fish Aquarium: ప్రతి ఒక్కరికి అక్వేరియం అంటే చాలా ఇష్టం. కానీ ఈ అక్వేరియంలో పెట్టే చేపల రకాలు మరియు వాటి సంఖ్య గురించి కూడా వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. జ్యోతిషా శాస్త్రం ప్రకారం అక్వేరియంలో ఉంచిన బంగారు చేపలు, ఆరో వాన, ఫ్లవర్ హార్న్ చేపలు ఇంట్లో సంపాద మరియు అదృష్టాన్ని తెస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వీటిని ఇంట్లో సరైన దిశలో మాత్రమే పెట్టాలి. లేకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్దిష్ట సంఖ్యలో అక్వేరియంలో చేపలను పెట్టడం వలన చాలా లాభాలు కలుగుతాయి. ఆ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.
జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం ఆ ఇంట్లో సంపద, శాంతి మరియు సానుకూల శక్తిని ఆకర్షించే మార్గంగా నిపుణులు చెప్తున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఈ అక్వేరియం ఏ దిశలో పెట్టాలి అలాగే దీనిలో ఉండే చేపల రకాలు, దాని నిర్వహణ గురించి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఇంట్లో చేపల అక్వేరియం పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చేపల అక్వేరియం ఆ ఇంట్లో సానుకూల శక్తి కలిగేలా చేస్తుంది.
ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు సంపదకు చిహ్నంగా చెప్తారు కాబట్టి ఎక్వేరియంలో కదిలే చేపలు ఈ శక్తిని చైతన్యవంతం చేస్తాయి. జ్యోతిషా శాస్త్రం ప్రకారం ఇంట్లో అక్వేరియం ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు దిశలో పెట్టడం చాలా శుభప్రదంగా చెప్తారు. ఈ మూడు దిశలో జలతత్వంతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఈ దిశలలో అక్వేరియం పెట్టడం శుభప్రదం. ఉత్తర దిశలో అక్వేరియం పెడితే కుబేరుడి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో దక్షిణ లేదా నైరుతి దిశలో అక్వేరియం పెట్టడం మంచిది కాదు. పొరపాటున పెడితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ఆకర్షిస్తుంది.