Kidney Disease: మూత్రంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే

Kidney Disease
Kidney Disease

Kidney Disease: ప్రతి ఒక్కరు కూడా తమ కిడ్నీల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అయితే కొన్ని సంకేతాల ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు అని నిపుణులు చెప్తున్నారు. మన శరీరంలో ఉండే కొన్ని అవయవాలు ఆరోగ్యానికి హాని కలిగించే వైరస్, బ్యాక్టీరియా శరీరంలోకి చేరకుండా నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడానికి ప్రత్యేకంగా కొన్ని అవయవాలు పనిచేస్తాయి. ముఖ్యంగా శరీరంలో ఉన్న మూత్రపిండాలు శరీరంలో రక్తాన్ని ఫిల్టర్ చేసి వాటిలో ఉన్న మలినాలు, విష వ్యర్ధాలను మూత్రం ద్వారా బయటకి పంపిస్తాయి.

అయితే శరీరంలో ఇంత ముఖ్యమైన పని చేసే కిడ్నీలో సరిగ్గా పనిచేయకపోయినా లేక కిడ్నీలో దెబ్బ తిన్నా కూడా శరీరంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కిడ్నీలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అయితే కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. శరీరంలో ఉన్న కొన్ని సంకేతాల ద్వారా కూడా కిడ్నీల పనితీరును తెలుసుకోవచ్చు. ఇటువంటి కొన్ని లక్షణాలు తరచూ కనిపిస్తే కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. మూత్రంలో వచ్చే మార్పులను బట్టి కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు అని నిపుణులు చెప్తున్నారు.

మూత్రం నురగగా రావడం, అలాగే తరచూ మూత్రం వస్తుండడం, అతి తక్కువగా రావడం, మూత్రంలో రక్తం వంటివి కనిపించడం కిడ్నీల అనారోగ్యాన్ని సూచిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ప్రోటీన్ మూత్రంలో లీకైన సమయంలో మూత్రం నురగతో వస్తుంది. రోజు మొత్తంలో తగినంత నీరు తాగకపోయినా సాధారణం కంటే తక్కువగా వస్తుంది. ఎక్కువగా ఉంటే అది నార్ చూరియా పరిస్థితికి దారితీస్తుంది. పగటి సమయంలో మీకు మూత్రం ఎక్కువగా వస్తున్నట్లయితే అది కిడ్నీ వ్యాధికి సంకేతంగా తెలుసుకోవాలి. ఒకవేళ మూత్రంలో రక్తం కనిపిస్తే అది కిడ్నీలో రాళ్లు లేదా మూత్రనాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కిడ్నీలో ఉన్నట్లు తెలుసుకోవాలి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now