Google Search: Google లో ఈ 3 విషయాలపై సర్చ్ చేస్తున్నారా..! అయితే మీకు జైలు శిక్ష తప్పదు

Google Search
Google Search

Google Search: ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ యుగంలో సైబర్ భద్రతా సంస్థలు ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. అలాగే అనుమానస్పద లేదా చట్టవిరుద్ధమైన ఆన్లైన్లో పాల్గొనే వ్యక్తులను గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి ఇప్పటివరకు అనేక దేశాలు బలమైన వ్యవస్థలను అమలు చేశాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా గూగుల్ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందుగా గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు.

ఏ సమాచారం కావాలన్నా గూగుల్లో వెతుకుతున్నారు. కానీ ప్రతి ప్రశ్నకు కూడా మీకు కావాల్సిన సమాధానం కోసం కొన్ని సార్లు గూగుల్ ని అడగడంతో మీరు ఇబ్బందులు పడే ప్రమాదం కూడా ఉంది. కొన్ని పదాలను గూగుల్లో వెతికితే ఏకంగా జైలుకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ నియమాలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పబ్లిక్ డొమైన్లో శోధించడం కొన్ని విషయాలు నిషేధించబడ్డాయి. Google లో పొరపాటున కూడా పిల్లలకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ను వెతకడానికి ప్రయత్నించకూడదు.

అలా చేయడం చట్టరీత్యా నేరం. దీనికి కఠినమైన చట్టం ఉంది. ఇలా చేసి ఒక వ్యక్తి పట్టుబడినట్లయితే అతనికి కఠిన శిక్ష తప్పదు. ఆ వ్యక్తికి ఐదు నుండి ఏడు ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా బాంబును ఎలా తయారు చేస్తారు అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా చిక్కుల్లో పడినట్లే. ఇటువంటివి గూగుల్లో వెతికితే భద్రత ఏజెన్సీలా రాడారు పైకి రావచ్చు. Google సెర్చ్ సహాయంతో ఒక వ్యక్తి ఇంటర్నెట్లో హ్యాక్ చేయడానికి మార్గం కోసం వెతికినా కూడా గూగుల్ కు నచ్చదు. అటువంటి వ్యక్తులకు కూడా కఠినమైన శిక్ష పడుతుంది. ఈ మూడు విషయాలను గూగుల్లో సెర్చ్ చేయకూడదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now