Indian Railways: రైల్వే ప్యాసింజర్ల కోసం ఆపరేషన్ అమానత్.. రైల్లో మీ లగేజి పోతే.. ఇలా రికవరీ చేసుకోవచ్చు

Indian Railways: రైల్వే ప్యాసింజర్ల కోసం ఆపరేషన్ అమానత్.. రైల్లో మీ లగేజి పోతే.. ఇలా రికవరీ చేసుకోవచ్చు
Indian Railways: రైల్వే ప్యాసింజర్ల కోసం ఆపరేషన్ అమానత్.. రైల్లో మీ లగేజి పోతే.. ఇలా రికవరీ చేసుకోవచ్చు

 Indian Railways: భారతీయ రైల్వే రెస్టారెంట్ డివిజన్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆపరేషన్ అమానత్లో ఎవరైనా లగేజీని కోల్పోతే తిరిగిపొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల మంది ప్యాసింజర్ లో రైల్వే ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్లు రైళ్లలో పర్సు పోగొట్టుకోవడమో, లాప్టాప్ లేదా మొబైల్ ఫోన్ మిస్ చేసుకోవడం లేదా ఇతర సామాన్లు మర్చిపోవడమో వంటివి చేస్తూ ఉంటారు. అయితే రైళ్లలో మిస్ అయిపోయిన లగేజీని వెతికి పట్టుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని.

చివరి స్టాప్ లో దిగినట్టయితే ఆ సదరు రైల్వే స్టేషన్ కి వెళ్లి ఎంక్వయిరీ చేస్తే ఆ లగేజీ దొరికే అవకాశం ఉంటుంది. ప్యాసింజర్ లో సౌకర్యార్థం భారతీయ రైల్వే తన సేవలను విస్తరింప చేస్తుంది. ప్యాసింజర్ లో సామాన్లకు ప్రాముఖ్యత ఇస్తూ ప్యాసింజర్లు కోల్పోయిన లగేజ్ ని తిరిగి దక్కించుకునే ఫెసిలిటీని భారతీయ రైల్వే కల్పిస్తుంది. ఈ క్రమంలో భాగంగా వెస్ట్రన్ డివిజన్ ఆపరేషన్ అమానత్ అనే ఓ ఆన్లైన్ పోర్టల్ ను ప్యాసింజర్లకు ఇంట్రడ్యూస్ చేసింది. ఒకవేళ ఎవరైనా లగేజీని కోల్పోతే ఈ వెబ్సైట్లోకి వెళ్లి ఫిర్యాదు చేసి తిరిగి పొందవచ్చు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఆపరేషన్ అమానాస్ లో భాగంగా పేద ప్రయాణికులకు అండగా నిలుస్తున్నారు. వీళ్ళు ప్యాసింజర్లు కోల్పోయిన లగేజీని తిరిగి డివిజన్ అధికారులకు సబ్మిట్ చేసి తమ డ్యూటీని అతీతంగా చేస్తున్నారు. ట్రైన్ చివరి స్టేషన్ కి చేరిన తర్వాత రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా ఈ పోలీసులు ట్రైన్ ను పూర్తిగా చెక్ చేస్తారు. ఈ క్రమంలో వాళ్లు ఎవరైనా ప్యాసింజర్లు మర్చిపోయిన లగేజీలు మరియు ఇతర డివైస్లు సామాన్లు వంటివి లభిస్తే వాటి ఫోటో తీసి సంబంధిత డివిజన్లకు పంపిస్తారు. వీటితోపాటు ఆర్పీఎఫ్ పోలీసులు అలాగే లో ఏమున్నాయి, వాటి విలువ ఎంత, లగేజీ కోల్పోయిన తేదీ వంటి పూర్తి వివరాలను సబ్మిట్ చేస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now