Pan Card: మీకు పాన్ కార్డు ఉందా..! అయితే రూ.5 లక్షలు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.. ఇలా అప్లై చేసుకోండి

Pan Card
Pan Card

Pan Card: మన దేశ ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వం అందించే గుర్తింపు కార్డులు అన్నీ కూడా చాలా కీలకము. కొన్ని సేవలు పొందాలంటే ఈ కార్డులు తప్పనిసరిగా ఉండాలి. ఇక ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు జారీ చేసే పాన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక లావాదేవీలను చేయడానికి తప్పనిసరిగా ఉండాలి. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కి టూల్ గా పరిగణించబడుతుంది. పాన్ కార్డును డబ్బును ట్రాక్ చేయడంలో అలాగే పన్ను ఎగవేతను నిరోధించడంలో కీలకంగా మారుతుంది. పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తో అలాగే ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉంటుంది.

ఇటీవల పాన్ కార్డు ఉపయోగించే పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా సులభతరంగా మారింది. మీ పాన్ కార్డును ఉపయోగించి ఐదు లక్షల వరకు పర్సనల్ లోను తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ క్రెడిబిలిటీని నిరూపించే ఐదు అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ నీ పాన్ కార్డు అంటారు. మీ పాన్ కార్డును మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసినప్పుడు కేవైసీ వెరిఫికేషన్ చాలా వేగంగా జరుగుతుంది. దీంతో మీరు అప్లై చేసిన లోను వేగవంతంగా ప్రాసెస్ అయ్యేలాగా జరుగుతుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే మీకు లోన్ అప్రూవల్ అందుతుంది. ఒకవేళ మీ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింకు కాకపోతే మీ లోన్ అప్లికేషన్ అప్రూవ్ అవ్వడానికి ఆలస్యం కావచ్చు. లేదా మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది.

మీరు పాన్ కార్డును ఉపయోగించి పర్సనల్ లోను దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఈ డాక్యుమెంట్లో తప్పనిసరిగా ఉండాలి. అవి పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఇలా ఏదైనా ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఒకటి అడ్రస్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. వీటితో పాటు మూడు నెలల బ్యాంకు స్టేట్మెంట్ మరియు గత రెండు నెలల శాలరీ స్లిప్పులు లేదా ఫారం 16 తో శాలరీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అయితే ఈ లోన్ ప్రాసెస్ ఆలస్యం కాకుండా ఉండాలంటే పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ కచ్చితంగా అయి ఉండాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now