Lizard Effect: గౌలి శాస్త్రం అనే ఉప జ్యోతిష్య శాస్త్రంలో బల్లి పడడం గురించి ప్రస్తావించబడింది. దీని గురించి గరుడ పురాణం అలాగే సంస్కృత శాస్త్ర గ్రంథాలలో కూడా చెప్పబడింది. బ్రహ్మస్మి చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ బల్లి శరీరం పై పడిన ప్రదేశం ఆధారంగా దాని ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది అని తెలిపారు. బల్లి శరీరం మీద ఏ భాగంలో పడిందో దాన్నిబట్టి అది శుభమా లేదా అశుభమా అని చెప్పవచ్చు. అయితే స్త్రీలపై బల్లి పడితే వాళ్ళ కొప్పుపై రోగ భయము, తల మీద పడితే ప్రాణభయం, పిక్కలు మీద పడితే బంధువుల దర్శనం, ఎడమ కన్ను మీద పడినట్లయితే భర్త ప్రేమ, కుడి కన్ను మీద పడితే మనోవ్యధ, వక్షమున పడినట్లయితే సుఖము, అలాగే కుడి చెంప మీద పడినట్లు అయితే పుత్ర లాభం కలుగుతుంది.
బల్లి కుడి చెవి మీద పడినట్లయితే ధన లాభం కలుగుతుంది. అలాగే బల్లి పై పెదవి మీద పడినట్లయితే విరోధములు, క్రింద పెదవే మీద పడితే వస్తు లాభం కలుగుతుంది. స్త్రీల వీపు పైపడితే మరణ వార్త, గోళ్ళపై పడితే కలహం, మోకాళ్ళందు పడితే కష్టమో, ఎడమ భుజం మీద పడితే సుఖం, కుడి కాలిపై పడితే శత్రునాశనం అని దీని గురించి చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పుకొచ్చారు. అలాగే ఒకవేళ బల్లి పురుషుల మీద పడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
పురుషుల తల మీద పడితే కలహం, బ్రహ్మ రంద్రమున పడినట్లయితే మృత్యువు, పురుషుల ముఖం మీద పడితే ధన లాభం, ఎడమ కన్ను మీద పడితే శుభం, కుడి కన్ను మీద పడితే అపజయం, నుదురు మీద పడితే బంధ సన్యాసం, కుడి చెంప మీద పడితే దుఃఖం, ఎడమ చెవి మీద పడితే లాభం, పై పెద్దవి మీద పడితే కలహం, క్రింద పెదవి మీద పడితే ధన లాభం, ఎడమ మోపు మీద పడితే జయం, వీళ్ళపై పడితే స్నేహితుల రాక, కుడి భుజం మీద పడితే కష్టం, అలాగే ఎడమ భుజం మీద పడితే అగౌరవం కలుగుతాయట.