GOLD: మనదేశంలో బంగారం కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా సంస్కృతి మరియు సంప్రదాయాలతో కూడా ముడిపడి ఉంది. ముఖ్యంగా మన దేశ మహిళలు పండుగలు, పెళ్లిళ్లు వంటి శుభ సందర్భాలలో బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మన సంస్కృతి సాంప్రదాయం బంగారం డిమాండ్ ను ఎప్పటికీ కూడా ఉన్నత స్థాయిలో ఉంచుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే దుబాయ్ లో బంగారం కొనడం చాలా ఆకర్షణయంగా ఉంటుంది అని చెప్పొచ్చు.
దుబాయ్ లో బంగారం స్వచ్ఛత చాలా ఉన్నతంగా ఉండడమే కాకుండా అక్కడ బంగారం ధరలు కూడా రీజనబుల్ గా ఉంటాయని అందరు నమ్ముతారు. అలాగే దుబాయిలో బంగారం కొనుగోలుపై పన్నులు లేకపోవడం మరియు దిగుమతి సుంకాలు అవసరం లేకపోవడం, పోటీ తత్వం వల్ల అక్కడ అందించే ఆఫర్లు అన్నీ కూడా దీనినే మరింత లాభదాయకంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో చాలామంది దుబాయ్ లో బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి కొంతమంది చట్ట విరుద్ధ మార్గాలను కూడా అనుసరిస్తారు.
దుబాయిలో ఆరు నెలలకు పైగా నివసిస్తున్న వారు ఎవరైనా సరే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సిస్ అండ్ కస్టమ్స్ నిబంధనల ప్రకారం అక్కడ కస్టమ్స్ డ్యూటీకి చెల్లించి ఒక కిలో వరకు బంగారాన్ని తమ లగేజ్ లో తీసుకొని రావడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ ఈ బంగారం పరిమితికి మించి ఉన్నట్లయితే ఈ బంగారం సుంకం చెల్లించినదిగా నిరూపించి అక్కడ రెడ్ ఛానల్ ద్వారా కస్టమ్స్ విధానాలను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశానికి బంగారం దిగుమతి సొంతం 6% గా ఉందని సమాచారం. అయితే కొంతమంది మాత్రం దీనిని తప్పించుకునేందుకు బంగారం స్మగ్లింగ్ కు ప్రయత్నిస్తారు. అయితే కొంత బంగారాన్ని సుంకం చెల్లించకుడా కూడా తీసుకొని రావచ్చు. కానీ దీనికి నిర్దిష్ట పరిమితులు వర్తిస్తాయి.