Home ఆధ్యాత్మికం Vaishakh Purnima 2025: వైశాఖ పౌర్ణమి ప్రత్యేక రోజున.. ఇంట్లో ఈ 4 ప్రదేశాలలో దీపం...

Vaishakh Purnima 2025: వైశాఖ పౌర్ణమి ప్రత్యేక రోజున.. ఇంట్లో ఈ 4 ప్రదేశాలలో దీపం వెలిగించడం.. మీకు చాలా లాభాలు

Vaishakh Purnima 2025
Vaishakh Purnima 2025

Vaishakh Purnima 2025: హిందూమత సాంప్రదాయం ప్రకారం ప్రతి తిధికి కూడా ఒక ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఏడాది మే 12, 2025న వైశాఖ పౌర్ణమి తిధి ఉంది. అయితే ఈ ప్రత్యేక శుభదినం రోజున మీరు దీపానికి సంబంధించిన ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు కోరుకున్న ఫలితాన్ని అందుకోవచ్చు. ఈ పవిత్రమైన రోజున ఇంట్లో మీరు నాలుగు చోట్ల దీపాలను వెలిగించాలి. హిందూమతంలో పౌర్ణమి తిధిని చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఇదే రోజున చంద్రుడు పూర్ణ భింబంగా దర్శనం ఇస్తాడు అన్న సంగతి తెలిసిందే.

ఈ రోజున చంద్రుడికి అర్జ్యం సమర్పించడం వలన ఒత్తిడి తగ్గుతుంది అని చాలామంది నమ్ముతారు. ఈరోజు లక్ష్మీదేవి పూజకు మరియు విష్ణువుకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అని చెప్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని విష్ణువును పూజించడం వలన ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది అని నమ్ముతారు. ఈరోజున బుద్ధపూర్ణిమ గా కూడా అందరూ జరుపుకుంటారు. మే 12, 2025న ఈ ఏడాది వైశాకి పూర్ణిమ వచ్చింది. అయితే ఈ శుభదినం రోజున ఇంట్లో నాలుగు ప్రదేశాలలో దీపాలను వెలిగిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు చెప్తున్నారు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని కూడా నిపుణులు చెప్తున్నారు.

మే 11 సాయంత్రం 6:55 గంటలకు వైశాఖ పౌర్ణమి తిధి ప్రారంభం అవుతుంది. ఇది మే 12 రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది. ఈ పరిస్థితిలో మే 12న వైశాఖ పౌర్ణిమను అందరు జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువును మరియు లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించినట్లయితే అన్ని రకాల ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి తొలగిపోతుంది అని నమ్ముతారు. ఈరోజున తులసి మొక్కను పూజిస్తారు. తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని ఆ వ్యక్తి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాడు అని నమ్ముతారు. అలాగే ఈ రోజున ఇంటి పూజ గదిలో దీపం వెలిగించడం వలన వాళ్ళ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని ఆర్థిక లాభం ఉంటుందని అందరి నమ్మకం. ఈ ప్రత్యేకమైన రోజున వంటగదిలో దీపం వెలిగించడం వలన అన్నపూర్ణాదేవి ప్రసన్నమయ్యే ఇంట్లో ఎప్పుడు ఆహార కొరత ఉండదని చాలామంది నమ్ముతారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now