BANK JOBS: ఐడిబిఐ బ్యాంకులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు

BANK JOBS
BANK JOBS

BANK JOBS: దేశంలో ఉన్న ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ అన్ని బ్రాంచ్ లలో కూడా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతూ తాజాగా ఐడిబిఐ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మే 8వ తేదీ నుంచి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేట్ ఐడిబిఐ భర్తీ చేయనుంది. అయితే దీనికి దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న వారు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో 60 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు పిడబ్ల్యుడి అభ్యర్థులు డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు అభ్యర్థులు కంప్యూటర్ నాలెడ్జి కూడా కలిగి ఉండాలి. మే ఒకటి 2025వ తేదీ నాటికి వయస్సు పరిమితి 20 నుంచి 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న అభ్యర్థులు మే రెండు, 2000 నుంచి మే 1, 25వ తేదీ మధ్యలో జన్మించిన వారు అయి ఉండాలి. అలాగే రిజర్వేషన్ ఉన్న వర్గాలకు వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది. మే 20వ తేదీ 2025 నుంచి ఆన్లైన్లో ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్, ఓబీసీ మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1050, అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు పిడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250 ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేయబడుతుంది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో 200 మార్కులకు మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు నాలుగు విభాగాలలో ఉంటాయి. 200 మార్కులకు పరీక్షా సమయం 120 నిమిషాలు ఉంటుంది. తప్పు ప్రశ్నకు 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now