UPI PAYMENTS: ఇటీవలే స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ లో వాడకం పెరుగుతూ ఉండడంతో డబ్బులు లావాదేవీలలో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్ని ఏళ్ల నుంచి మన దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నచిన్న చెల్లింపుల నుంచి ఫీజు చెల్లింపుల వరకు కూడా ఎక్కడ చూసినా ఆన్లైన్లోనే డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీలను అందించే ప్లాట్ఫార్మ్లో ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి కొత్త కొత్త ఫీచర్స్ లను ప్రవేశపెడుతున్నాయి. ఫోన్ పే కూడా లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఒక ఫీచర్ ని తాజాగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఫోన్ పే లో ఉన్న యూపీఐ సర్కిల్ ఫీచర్లతో అవసరమైన సమయంలో తన వినియోగదారులకు సహాయం చేయవచ్చు.
తాజాగా వచ్చిన ఈ ఫీచర్ తో వినియోగదారులు తమకు అవసరమైనప్పుడు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు యూపీఐ చెల్లింపులు చేయగలుగుతారు. ఇందుకోసం వారికి బ్యాంకులో ఖాతా కూడా ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంకులో ఖాతా లేని వాళ్ళ కోసం ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి వాళ్ళు యూపీఐ ఉపయోగించి తమ స్నేహితులకు చెల్లింపులు చేయగలుగుతారు. ఈ సరికొత్త ఫీచర్ ని ఎన్పీసీఐ ప్రారంభించింది. గతంలో ఎన్పీసీఐ ఈ ఫీచర్ ని గూగుల్ పే యాప్ కు పరిమితం చేసింది.
కానీ తాజాగా ఈ ఫీచర్ ని ఫోన్ పే లో కూడా అందుబాటులోకి తెచ్చింది. తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ఫోన్ పే పోస్ట్ ద్వారా యూపీఐ సర్కిల్ ఫీచర్ రాకను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకు ఖాతా లేదా నెట్ బ్యాంకింగ్ సదుపాయం లేని సభ్యులకు ఆన్లైన్ చెల్లింపులు చేయాలనుకుంటే ముందుగా ఆ సభ్యుడు ఫోన్ పే ఖాతకు జోడించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మీరు యూపీఐ చెల్లింపులు చేయగలుగుతారు. క్యూఆర్ కోడ్ నౌ స్కాన్ చేసి చెల్లింపు అభ్యర్థన ప్రాథమిక సభ్యునికి వెళ్తుంది. ఆ తర్వాత మీరు చెల్లింపును చేయవచ్చు.