Home తాజా వార్తలు STUDENTS JOBS: ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉన్న వాళ్లకు.. బంపర్ ఆఫర్…ఈ ఉద్యోగం మీ కోసమే

STUDENTS JOBS: ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉన్న వాళ్లకు.. బంపర్ ఆఫర్…ఈ ఉద్యోగం మీ కోసమే

STUDENTS JOBS
STUDENTS JOBS

STUDENTS JOBS: బీటెక్ చేసిన వాళ్ల కోసం ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఒక గుడ్ న్యూస్. యువతకు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 7. అయితే ఈ తాజా నియమాకం ద్వారా మొత్తం 52 పోస్టులను అధికారులు భర్తీ చేయనున్నారు. వీటి ద్వారానే నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు కూడా నియమాకాలు జరుగుతాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నావాళ్లు ఇచ్చిన అంశాలను జాగ్రత్తగా చదివి దరఖాస్తులు చేసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మేనేజ్మెంట్ ట్రైని బిఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలు ఉండాలి. వాళ్లు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఎంపిక అయితే వాళ్లకు నెలకు రు.60,000 నుండి రూ.1,80,000 జీతం లభిస్తుంది. అలాగే ఈ పోస్టులకు అభ్యర్థులు గేట్ 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్కు పిలుస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now