Ration Cards: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్త తెలిపింది. ఎప్పటినుంచో చాలామంది రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లను చేర్చేందుకు చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాత రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడానికి సంబంధించిన దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా వేగవంతం చేసింది. ఇప్పటివరకు పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ కు సంబంధించిన దరఖాస్తులలో దాదాపు 20 శాతం వరకు పూర్తి చేసింది.
త్వరలోనే మిగిలిన దరఖాస్తులను కూడా పరిష్కరిస్తామని ఇటీవలే పౌరసరఫరాల శాఖ అధికారులు తెలపడం జరిగింది. ముఖ్యంగా పాత రేషన్ కార్డులలో కొత్త ఇంటి సభ్యుల పేర్ల చేర్పుల కోసం ఎక్కువ దరఖాస్తులు గ్రేటర్ పరిధిలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలలో వచ్చాయి. ఏకంగా మూడు లక్షలకు పైగా దరఖాస్తులు గ్రేటర్ పరిధిలో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. గత ప్రభుత్వం ఉన్న సమయం నుంచే పాదరేషన్ కార్డులలో కొందరి సభ్యుల పేర్లు తొలగింపు జరుగుతున్నప్పటికీ కూడా పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యుల పేర్ల చేరిక ప్రక్రియ మాత్రం అందుబాటులో లేదు.
అయితే ఉమ్మడి కుటుంబాలు రెండుగా విడిపోవడం అలాగే పెళ్లిళ్లు జరగడం వలన కుటుంబంలో కొత్త సభ్యులకు సంబంధించిన పేర్లను చేర్చడం వంటి వాటి వలన దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటివరకు ఈ పెండింగ్ ఉన్న దరఖాస్తులలో 20% పూర్తి చేసినట్లు తెలుస్తుంది. మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యుల పేర్లను చేర్చడానికి ఇప్పటినుంచో దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. అయితే పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యుల చేరికకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా ఉండడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.