Free Driving: వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత మోటారు డ్రైవింగ్ శిక్షణ అందించబోతుంది. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం విద్యా, సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి ఇలా పలు కార్యక్రమాలను చేపట్టింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ విభాగం ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వెనుకబడిన తరగతుల పిల్లలకు ప్రీ మ్యాట్రిక్, కళాశాల హాస్టల్ లోకి బోర్డింగ్ మరియు బస్సు సౌకర్యాలు అందిస్తుంది. మెరిటేరియస్ బ్యాక్వర్డ్ క్లాసులకు నాణ్యమైన విద్యాభ్యాసం ఉంచడంతోపాటు స్కాలర్షిప్ మరియు హాస్టల్ సదుపాయం కూడా కల్పిస్తుంది.
అలాగే పలు రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కూడా అందిస్తుంది. తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ తాజాగా వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు ఒక మంచి శుభవార్తను తెలిపింది. హనుమకొండ జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రామారెడ్డి ఒక ప్రకటనలో నిరుద్యోగ యువతకు మోటార్ డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలియజేశారు. హనుమకొండ జిల్లాకు చెందిన అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హకీంపేట్ సౌజన్యంతో హైదరాబాద్ ఆధ్వర్యంలో హెవీ మోటార్ వెహికల్ మరియు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్లో శిక్షణ ఉంటుంది అంటూ తెలిపారు. డ్రైవింగ్ శిక్షణ ఎవరిది 30 రోజుల వరకు ఉంటుంది. అభ్యర్థులకు పర్మనెంట్ లైసెన్సు ఉచితంగా ఇస్తారు. అలాగే శిక్షణ పొందే సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం కూడా ఉంటుంది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు. అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కొరకు 20 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు అని తెలిపారు.