Home తాజా వార్తలు Plants Vastu: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే… మీ ఇంట్లో కనకవర్షమే.. ఆర్ధిక సమస్యలే...

Plants Vastu: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే… మీ ఇంట్లో కనకవర్షమే.. ఆర్ధిక సమస్యలే ఉండవు

Plants Vastu
Plants Vastu

Plants Vastu: చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా మొక్కలకు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని రకాల మొక్కలను కొన్ని దిక్కులలో పెంచడం వలన ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ రకమైన మొక్కలను ఆ దిక్కులో నాటడం వలన ఇంట్లో ఊహించని డబ్బు మరియు ప్రశాంతత కలుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్ర నియమాలను పాటించి కోరికలన్నీ తీర్చుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని అద్భుత మొక్కలు ఇంట్లో ఉండడం వలన మీ ఇంట్లో శ్రేయస్సు కలుగుతుంది అని ప్రస్తావించబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర దిశ కుబేరుడు కి సంబంధించింది.

ఈ రకాల మొక్కలను ఉత్తర దిశలో ఉంచడం వలన ఆ కుబేరుని ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇంట్లో మీ సంపద చాలా కాలం పాటు ఉంటుంది. ఇంటికి ఉత్తర దిశలో ఈ మొక్కలో ఉంచడం చాలా శుభప్రదం అని వాస్తు శాస్త్ర జ్యోతిష్యులు చెప్తున్నారు. మనీ ప్లాంట్ కు ఉన్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఈ మొక్క చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంటికి ఉత్తర దిశలో ఈ మొక్కను నాటడం వలన కుటుంబ సభ్యులందరికీ శుభం కలుగుతుంది.

ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది. ఇక ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్క ఉంచడం వలన ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది అంటూ నిపుణులు చెప్తున్నారు. అరటి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది. నారాయణోడు అరటి మొక్కలు నివసిస్తాడు అని చాలామంది నమ్ముతారు. అలాంటి అరటి మొక్కను ఇంటి ఉత్తర దిశలో ఉంచడం వలన ఇంటికి చాలా శుభం చేకూరుతుంది. ఇంటికి ఉత్తర దిశలో అరటి మొక్కను ఉంచితే ఆ మొక్కకు మీ విధిని మార్చే శక్తి కూడా ఉంటుంది అని చాలామంది నమ్ముతారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now